Janhvi Kapoor : నాకు సోషల్ మీడియా నుంచి డబ్బులొస్తున్నాయి.. అందుకే అలాంటి ఫోటోలు పెడుతున్నాను..

Kaburulu

Kaburulu Desk

November 9, 2022 | 02:47 AM

Janhvi Kapoor : నాకు సోషల్ మీడియా నుంచి డబ్బులొస్తున్నాయి.. అందుకే అలాంటి ఫోటోలు పెడుతున్నాను..

Janhvi Kapoor :  స్టార్ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఫాలోవర్స్ పెంచుకోడానికి రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక లేడీ సెలబ్రిటీలు అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి బోల్డ్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతారు. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉండటంతో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే యాడ్స్, సోషల్ మీడియా కంపెనీల నుంచి బాగానే డబ్బులు వస్తాయి.

బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కూతురు తన ఇన్‌స్టాగ్రామ్ లో ఏ రేంజ్ లో ఫోటోలు పోస్ట్ చేస్తుందో అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన అందాలని ఆరబోస్తూ బోల్డ్ ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలని పోస్ట్ చేస్తుంటుంది. దీంతో జాన్వీకి రోజు రోజుకి ఫాలోవర్స్, లైక్స్ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అడిగారు. మీరెందుకు రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తారు అని అడగగా జాన్వీ కపూర్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

Radhika Apte : గ్రీన్ కలర్ డ్రెస్‌లో రాధికా ఆప్టే సూపర్ లుక్స్

జాన్వీ మాట్లాడుతూ.. ”నేను ఆ ఫోటోలు పెట్టడాన్ని సరదాగానే తీసుకుంటాను. వాటివల్ల నాకు ఫాలోవర్స్ పెరుగుతారు. దాని నుంచి నాకు ఆదాయం వస్తుంది. ఆ వచ్చే ఆదాయంతో నేను EMIలు కట్టుకుంటున్నాను. అలాంటప్పుడు ఫోటోలు పోస్ట్ చేయకుండా ఎలా ఉంటాను” అని తెలిపింది. దీంతో జాన్వీ చెప్పిన జవాబుకి అందరూ షాక్ అయ్యారు. స్టార్ డాటర్ అయి ఉండి సోషల్ మీడియా నుంచి వచ్చే డబ్బులతో EMIలు కడుతున్నాను అంటే ఆశ్చర్యంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.