Asha Parekh : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆశా పారేఖ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే..

Kaburulu

Kaburulu Desk

September 30, 2022 | 01:42 AM

Asha Parekh : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆశా పారేఖ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే..

Asha Parekh :  70, 80 దశకాల్లో చాలా మంది స్టార్ హీరోలతో జత కట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆశా పారేఖ్ కి కేంద్ర ప్రభుత్వం 2020కి గాను సినిమా రంగంలోని అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించింది. ఈమేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకి తెలియచేసి తన అధికారిక సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు.

హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తర్వాత కూడా ఆశా పారేఖ్‌ సినిమా రంగంలోనే డిస్ట్రిబ్యూటర్‌గా, సినిమా నటుల అసోసియేషన్‌కు నాయకురాలిగా, ప్రొడ్యూసర్‌గా పలు సేవలు అందించారు. కేంద్ర సెన్సార్‌బోర్డుకు తొలి మహిళా చైర్మన్‌గా కూడా ఆశా పారేఖ్ తన సేవలు అందించారు. ఐదు దశాబ్దాలు సినీ రంగానికి ఆమె చేసిన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆశా పారేఖ్ కి ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు ప్రకటించింది.

#Adipurushteaser : ఆదిపురుష్ టీజర్ డేట్ ఫిక్స్.. అయోధ్యకి రాముడొస్తున్నాడు.. వెయిటింగ్ అంటున్న ఫ్యాన్స్..

ఆశా పారేఖ్ కి ఈ అవార్డుని 68వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం రోజు అందిస్తారు. అవార్డు ఎంపిక చేసిన కమిటీలో ఆశా భోంస్లే, హేమ మాలిని, పూనమ్ థిల్లాన్, ఉదిత్ నారాయణ్, TS నాగాభరణ్ ఉన్నారు. ఆశా పారేఖ్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.