Roshan : యాంకర్ సుమ తనయుడు హీరోగా ఎంట్రీ.. రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ తో

సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ రోషన్ గతంలో నిర్మలా కాన్వెంట్ అనే ఓ సినిమాలో నటించాడు. ఇప్పుడు హీరోగా తన మొదటి సినిమాతో రాబోతున్నాడు. తాజాగా రోషన్ నటిస్తున్న సినిమా నుంచి..................

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 10:10 PM

Roshan : యాంకర్ సుమ తనయుడు హీరోగా ఎంట్రీ.. రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ తో

Roshan :  తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంట్లో ఎవర్ని అడిగినా యాంకర్ సుమ గురించి చెప్తారు. గత కొన్ని సంవత్సరాలుగా సుమ తన మాటలతో, తన షోలతో ప్రతి తెలుగింటి ఆడపడుచు అయిపొయింది. కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా బిజీగానే ఉంది సుమ. సుమ ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో బిజీగా ఉంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది సుమ. కొన్ని నెలల క్రితమే సుమ మెయిన్ లీడ్ లో జయమ్మ పంచాయితీ అనే సినిమాతో వచ్చి విజయం సాధించింది.

ఇప్పుడు సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ రోషన్ గతంలో నిర్మలా కాన్వెంట్ అనే ఓ సినిమాలో నటించాడు. ఇప్పుడు హీరోగా తన మొదటి సినిమాతో రాబోతున్నాడు. తాజాగా రోషన్ నటిస్తున్న సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఇందులో రోషన్ DJ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. లవ్, రొమాంటిక్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోంది.

Saif Alikhan : NTR 30 లో బాలీవుడ్ స్టార్ విలన్ గా??

క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో హిట్స్ కొట్టిన డైరెక్టర్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ మొదటి సినిమాని చేస్తున్నాడు. యువ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. సుమ, రాజీవ్ లని ఆదరించిన ప్రేక్షకులు రోషన్ ని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.