జీఎస్టీ బిల్‌తో రూ. కోటి విలువ చేసే బహుమతులు గెలుచుకునే అవకాశం.. ఎలా పొందొచ్చంటే?

వస్తుసేవల పన్నుల విషయంలో సంస్కరణలను తీసుకు వచ్చి అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్ను వ్యవస్థగా వస్తు సేవల పన్నును రూపొందించింది కేంద్ర ప్రభుత్వము. కొత్త వస్తు సేవల పన్ను జీఎస్టీని ప్రవేశపెట్టింది.

Kaburulu

Kaburulu Desk

March 28, 2024 | 03:38 PM

జీఎస్టీ బిల్‌తో రూ. కోటి విలువ చేసే బహుమతులు గెలుచుకునే అవకాశం.. ఎలా పొందొచ్చంటే?

వస్తుసేవల పన్నుల విషయంలో సంస్కరణలను తీసుకు వచ్చి అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్ను వ్యవస్థగా వస్తు సేవల పన్నును రూపొందించింది కేంద్ర ప్రభుత్వము. కొత్త వస్తు సేవల పన్ను జీఎస్టీని ప్రవేశపెట్టింది. జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. జీఎస్టీని ప్రతిఒక్కరు చెల్లించేలా చర్యలు తీసుకుంటోంది. దీనిపై మరింత అవగాహన పెంచేందుకు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత చెల్లించినటువంటి జీఎస్టీ బిల్లును సంబంధిత యాప్ లో అప్ లోడ్ చేస్తే దాదాపు రూ. కోటి విలువ చేసే బహుమతులను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ వివరాలు మీకోసం..

జీఎస్టీ ఇన్‌వాయిస్ లను అప్ లోడ్ చేసి నగదు బహుమతులను పొందే విధంగా ‘మేరా బిల్ మేరా అధికార్’ ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుండి, ప్రభుత్వం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ‘మేరా బిల్ మేరా అధికార్’ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించనుంది. ‘మేరా బిల్ మేరా అధికార్’ యాప్ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌లో బిల్లులను ‘అప్‌లోడ్’ చేయడం ద్వారా, జీఎస్టీ చెల్లింపుదారులు రూ. 10 వేలు, రూ. 10 లక్షలు, రూ. 1 కోటి వరకు విలువచేసే బహుమతులు సొంతం చేసుకోవచ్చు. ఈ అవకాశం అస్సాం, గుజరాత్ మరియు హర్యానా, పుదుచ్చేరి, డామన్, డయ్యూ, దాద్రా మరియు నగర్ హవేలీలలో అందుబాటులో ఉండనుంది.

సీబీఐసీ ఈ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. యాప్‌లో అప్‌లోడ్ చేయబడిన ‘ఇన్‌వాయిస్’లో విక్రేత జీఎస్టీఐఎన్, ఇన్‌వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తం ఉండాలి. ఒక వ్యక్తి ఒక నెలలో గరిష్టంగా 25 బిల్లులను ‘అప్‌లోడ్’ చేయవచ్చు, కనిష్ట విలువ రూ.200గా నిర్ణయించారు. లక్కీ డ్రాల ద్వారా విన్నర్స్ ను నిర్ణయించి బహుమతులను అందజేయనున్నారు. కాబట్టి షాపింగ్ అనంతరం చెల్లించిన జీఎస్టీ బిల్లులను నిర్లక్ష్యంగా పారేయకుండా ఆ యాప్ లో అప్ లోడ్ చేసి లక్షలు, కోట్లు విలువ చేసే బహుమతులను పొందవచ్చు.