శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే..

హిందూ మత విశ్వాసం ప్రకారం శ్రావణ మాసం, కార్తీక మాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి ఏకాదశి మొదలుకుని ఉగాది వరకు మన పండుగలు జరుపుకుంటాం. అయితే ఆషాఢం తర్వాత శ్రావణంలో శ్రావణ పూర్ణిమ, రాఖీ పండుగ, మంగళ గౌరి వ్రతం,వరలక్ష్మీ వ్రతం, నాగ పంచమి, శ్రీ కృష్ణాష్టమి, ప్రదోష వ్రతం మొదలైన పండుగలు చేసుకుంటాం.

Kaburulu

Kaburulu Desk

March 28, 2024 | 03:31 PM

శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే..

హిందూ మత విశ్వాసం ప్రకారం శ్రావణ మాసం, కార్తీక మాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి ఏకాదశి మొదలుకుని ఉగాది వరకు మన పండుగలు జరుపుకుంటాం. అయితే ఆషాఢం తర్వాత శ్రావణంలో శ్రావణ పూర్ణిమ, రాఖీ పండుగ, మంగళ గౌరి వ్రతం,వరలక్ష్మీ వ్రతం, నాగ పంచమి, శ్రీ కృష్ణాష్టమి, ప్రదోష వ్రతం మొదలైన పండుగలు చేసుకుంటాం. ఈ పండుగలన్నీ జరుపుకునే నేపథ్యంలో మాంసాహారాన్ని స్వీకరించకుండా ఉంటారు.  శ్రావణ మాసంలో తెలుగు వారి పండుగలు, వ్రతాలు మొదలవుతాయి.  వ్రతాలను ఆచరించేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం..

ఆధ్యాత్మికంగా చూస్తే శ్రావణ మాసం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ముఖ్యమైన పూజలన్నీ శ్రావణ మాసంలోనే మొదలువుతాయి కాబట్టి పూర్తిగా ఈ నెలలో మాంసాహారాన్ని వదిలేస్తారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ టైంలో వానలు కూడా బాగా కురుస్తుంటాయి. కాబట్టి మాంసాహారం, నూనె పదార్థాలను స్వీకరిస్తే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయదని నిపుణులు తెలుపుతున్నారు.

శాకాహారం అయితే సులభంగా జీర్ణం అవుతుంది. ఈ సీజన్ లోనే అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ సీజన్ లో ఎండలు లేకపోవడంతో ఫంగస్ పెరిగి ఆహార పదార్థాలు పాడైపోతాయి. మాంసాహారం జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే శ్రావణ మాసంలో మాంసాహారం మానేస్తారు. అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆరోగ్య పరంగా నాన్ వెజ్ తీసుకోకుండా ఉండడం మంచిది.