Brahmaji : అయిదు గంటలు వెయిట్ చేయించారు.. కనీసం సారీ లేదు, సమాచారం లేదు.. ఫైర్ అయిన బ్రహ్మాజీ

Kaburulu

Kaburulu Desk

August 29, 2022 | 12:51 PM

Brahmaji : అయిదు గంటలు వెయిట్ చేయించారు.. కనీసం సారీ లేదు, సమాచారం లేదు.. ఫైర్ అయిన బ్రహ్మాజీ

Brahmaji :  మనం వెళ్లాల్సిన ట్రైన్, బస్సు లేట్ గా వస్తే చాలా అసహనంగా ఫీల్ అవుతాం. అలాంటిది సెలబ్రిటీలు వెల్లసిన ఫ్లైట్ టైంకి రాకుండా చాలా ఆలస్యం అయితే వాళ్ళెంత అసహనంగా ఫీల్ అవుతారో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఏకంగా అయిదు గంటలు తను వెళ్లాల్సిన ఫ్లైట్ కోసం ఎయిర్‌పోర్ట్ లోనే ఎదురు చూస్తూ ఉండాల్సింది.

దీనిపై నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్లో ఆ ఎయిర్‌లైన్స్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ”చండీఘడ్ నుంచి కులు వెళ్లాల్సిన అలయన్స్ ఎయిర్ విమానం ఇప్పటికే దాదాపు 2 గంటలు ఆలస్యమైంది. ఇప్పటివరకు దాని గురించి ఎటువంటి సమాచారం లేదు, లేట్ అయినందుకు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఎయిర్‌పోర్ట్ లోనే వెయిట్ చేస్తున్నా” అని బ్రహ్మాజీ ట్వీట్ చేశారు.

 

అయితే అయిదు గంటల నిరీక్షణ అనంతరం బ్రహ్మాజీ ఎక్కాల్సిన ఫ్లైట్ రావడంతో ఆ ఫ్లైట్ ఫోటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ”చివరికి అయిదు గంటల ఆలస్యం తర్వాత విమానం వచ్చింది. కానీ ఇప్పటివరకు కూడా అలయన్స్ ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి సమాచారం, క్షమాపణ లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ వాళ్ళది” అంటూ ఆ ఎయిర్‌లైన్స్ సంస్థని ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.