Multiplex Theaters : ఆ రోజంతా మల్టీప్లెక్స్ లో 75 రూపాయలకే సినిమాలు చూడొచ్చు.. ఛాన్స్ మిస్ అవ్వకండి..

Multiplex Theaters : చాలామంది మల్టీప్లెక్స్ లో సినిమాలు చూడాలి అనుకుంటారు. ఇటీవల టైర్ 2,3 నగరాల్లో కూడా మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చాయి. కానీ కొన్ని రోజుల క్రితం నుంచి సినిమా టికెట్ ధరలు పెరగడంతో మల్టీప్లెక్స్ లలో కూడా భారీగా టికెట్ ధరలు పెరిగాయి. మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ ధర స్టార్టింగ్ 200 నుంచి ఉంది. తాజాగా మల్టీప్లెక్స్ లో టికెట్ ధర 75 రూపాయలే అని ఆఫర్ ప్రకటించారు.
సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దేశంలోని దాదాపు అన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఆ ఒక్క రోజు సినిమా టికెట్ ధర 75 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించింది. 75 రూపాయలకే ఆ రోజంతా సినిమాలు చూడొచ్చు అని ప్రకటించారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పివిఆర్, ఐనాక్స్, ఐమాక్స్, ఆషియన్ లాంటి మల్టీప్లెక్స్ సంస్థలతో దీనిపై మాట్లాడుతుంది. అన్ని సంస్థలు ఓకే అంటే ఎంచక్కా 75 రూపాయలకే సెప్టెంబర్ 16న మల్టీప్లెక్స్ లో సినిమా చూడొచ్చు. దీంతో సినీ ప్రేమికులు ఈ ఆఫర్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.