Brahmastra Movie : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. చిత్ర యూనిట్ కి కోట్లలో నష్టం..

Kaburulu

Kaburulu Desk

September 3, 2022 | 01:03 PM

Brahmastra Movie : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. చిత్ర యూనిట్ కి కోట్లలో నష్టం..

Brahmastra Movie :  రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయన ముఖర్జీ దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో బాయ్ కాట్ వివాదం నడుస్తుండటంతో బాలీవుడ్ సినిమాలు తెలుగు, సౌత్ మర్కెట్స్ మీద ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే బ్రహ్మాస్త్ర యూనిట్ కూడా తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేసింది. ఈ సినిమాలో నాగార్జున నటించడం, తెలుగులో రాజమౌళి ఈ సినిమాని రిలీజ్ చేయడంతో పాటు బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని ఆహ్వానించి గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రామోజీ ఫిలింసిటీలో భారీగా సెట్ వేసి, ఎన్టీఆర్, రణబీర్ తో ఫైర్ వర్క్స్ ప్లాన్ చేసి, చాలా మంది అభిమానుల మధ్య గ్రాండ్ గా చేద్దామనుకున్నారు. కానీ చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ అయింది. వెంటనే హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ రద్దు వెనుక రాజకీయ కోణం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈవెంట్ రద్దుకు కారణాలు ఏవైనా చిత్ర యూనిట్ కి మాత్రం భారీ నష్టం ఏర్పడింది. ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేయడంతో అన్ని వ్యయాలు కలిపి దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో వెంటనే పార్క్ హయత్ లాంటి హోటల్ లో అప్పటికప్పుడు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి మరో 10 లక్షలు ఖర్చయ్యాయి. దీంతో బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో చిత్ర యూనిట్ కి దాదాపు 2 కోట్ల పైనే నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది.