Site icon Kaburulu

Asafoetida : వంటింట్లోని ఇంగువ.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా??

Benefits of taking Asafoetida in food

Benefits of taking Asafoetida in food

Asafoetida :  మన భారతీయులు చాలా రకాల వంటలలో ఇంగువ వాడుతుంటారు. సువాసన కోసం, రుచి కోసం ఇంగువని కూరల్లో, పులుసు, సాంబార్.. మరికొన్ని వంటల్లో చేరుస్తారు. ఇంగువ వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంగువ ఆయుర్వేద వైద్యాలలో కూడా వాడేవారు. ఇంగువలో కూడా రకాలు ఉంటాయి. ఇంగువ పొడి రూపంలోనూ, ముద్దగానూ, గడ్డలుగాను దొరుకుతుంది.

ఇంగువ వలన కలిగే ప్రయోజనాలు..

*ఇంగువ మన ఆహారంలో భాగం అవ్వడం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.
*పాలు తాగే పిల్లలు ఒక్కొక్కసారి ఎక్కువగా ఏడుస్తుంటారు. ఆ సమయంలో పిల్లలకు కడుపులో గ్యాస్ నొప్పి వస్తుంది. శిశువులలో గ్యాస్ నొప్పిని తగ్గించడానికి రెండు స్పూన్ల గోరువెచ్చని నీళ్ళల్లో చిటికెడు ఇంగువ వేసి బాగా కలిపి దానిని యాంటి క్లాక్ పద్దతిలో పొట్టపై రాయాలి. అప్పుడు గ్యాస్ నొప్పి తగ్గుతుంది.
*అర టీ స్పూన్ ఇంగువ పొడి, రెండు టేబుల్ స్పూన్ల శొంఠి పొడిని తేనెతో కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే జలుబు, దగ్గు వంటివి తగ్గుతాయి.
*పన్ను పుచ్చినప్పుడు నొప్పి వచ్చిన చోట తగ్గడానికి ఇంగువ పొడిని ఉంచుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది.
*రెండు కప్పుల నీటిని ఒక గిన్నెలో పోసుకొని బాగా మరిగించాలి. ఆ నీటిలో కొద్దిగా ఇంగువను కలపాలి. చల్లారిన తరువాత ఆ నీటిని రోజంతా తాగుతుండాలి. ఇలా చేయడం వలన ఎంతటి తలనొప్పి అయినా తగ్గుతుంది.
*ఇంగువ పొడిని కొబ్బరి నూనెలో కలిపి దురద, దద్దుర్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
*ఇంగువను రోజూ కూరల్లో వేసుకోవడం వలన మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
*హైబీపీని కంట్రోల్ చేయడంలో కూడా ఇంగువ సహాయపడుతుంది.

Exit mobile version