Hyderabad: భార్య గర్భిణీ.. లేడీ కానిస్టేబుల్ తో కానిస్టేబుల్ ప్రేమాయణం.. భర్త ఇంటి ముందు భార్య బైఠాయింపు!

Hyderabad: సమాజంలో పది మందికి న్యాయం చెప్పాల్సిన ఉద్యోగంలో ఉన్న కానిస్టేబుల్ కి దుర్భుద్ధి పుట్టింది. భార్య గర్భిణీ కావడంతో పుట్టింటికి పంపి సహోద్యోగి, లేడీ కానిస్టేబుల్ తో ప్రేమాయణం మొదలు పెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య పలుమార్లు భర్తను హెచ్చరించినా కానిస్టేబుల్ భర్త వినిపించుకోలేదు. చివరికి పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టినా.. లేడీ కానిస్టేబుల్ నా ప్రేయసి.. మీరేం చేస్తారో చేసుకోండని తెగేసి చెప్పాడు. దీంతో కానిస్టేబుల్ భర్త ఇంటి ముందే భార్య బైఠాయించి ఆందోళన చేస్తుంది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలం అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా పర్గి మండలం తొండపల్లిలో ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలోని మధాపూర్ డీసీపీ శిల్ప వల్లి వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నా డు. కాగా, అతడికి 2021లో పెద్దలు మిట్టకోడూరుకు చెందిన నర్సింహులు కుమార్తెతో వివాహం జరిపించారు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో అప్పట్లో కట్న, కానుకలను కూడా ఘనంగానే సమర్పించుకున్నారు. కాగా, ప్రస్తుతం భార్య గర్భిణి కాగా.. కొన్నాళ్ళుగా శ్రీశైలం ఆమెకి మొహం చాటేశాడు.
దీంతో శ్రీశైలం ప్రవర్తనతో భార్య ఆరా తీయగా లాడీ కానిస్టేబుల్ తో ప్రేమాయణం ఆమెకి తెలిసింది. దీనిపై భార్యను ప్రశ్నించినా ఫలితం లేదు. దీంతో ఇరు వైపుల నుండి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి కానిస్టేబుల్ శ్రీశైలం వ్యవహారంపై ప్రశ్నించారు. దీంతో లేడీ కానిస్టేబుల్ తో ప్రేమ వ్యవహారం నిజమేనని.. ఆమెని వదిలేదని కూడా పెద్ద మనుషుల ముందే తెగేసి చెప్పాడు. దీంతో భార్య భర్త ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది.
బాధితురాలి వివరాల ప్రకారం.. తను గర్భి ణి కావడంతో భర్త శ్రీశైలం మరో లేడీ కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వాపోయింది. బంధువులంతా ఎంతో నచ్చ జెప్పినా శ్రీశైలం బుద్ధి మారలేదని.. పంచాయతీలో పెద్దలను సైతం మీ ఇష్టమొచ్చినట్లు ఏమైనా చేసుకోండంటూ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. దీంతో చేసేదేమీ లేక న్యాయం చేయాలని ఆమె భర్త ఇంటి ముందు బంధువులతో బైటాయించినట్లు తెలిపింది.