Ayyanna Patrudu: ఎవడండీ గంటా..?.. అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్!

Kaburulu

Kaburulu Desk

January 19, 2023 | 04:58 PM

Ayyanna Patrudu: ఎవడండీ గంటా..?.. అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్!

Ayyanna Patrudu: కాస్త వయసు మీదపడినా టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడంటే ఇప్పటికీ ఫైర్ బ్రాండే. ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాలపై సోషల్ మీడియాలో సెటైర్లతోనే ఏకిపారేసే అయ్యన్న సొంత పార్టీ నేతలపై కూడా అప్పుడప్పుడు ఘాటు విమర్శలకు దిగుతుంటారు. ఇప్పుడు కూడా అలాగే టీడీపీ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర కీలక నేత గంటా శ్రీనివాసరావుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఎవడండీ గంటా.. ఏమైనా పెద్ద నాయకుడా అంటూ అయ్యన్న రెచ్చిపోయారు.

ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన అయ్యన్న.. గంటాను ఉద్దేశించి.. ఎవడండీ గంటా.. లక్షల్లో వాడొక్కడు.. లక్షల్లో నేనొక్కడిని.. గంటా ఏమైనా పెద్ద నాయకుడా.. ప్రధానా అంటూ ఫైర్ అయ్యారు. పార్టీ కష్టకాలంలో కూడా పని చేయాలనేదే తమ కోపంగా చెప్పుకొచ్చారు. పార్టీలో అందరూ రావాలి.. పని చేయాలని పేర్కొన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్న అయ్యన్న.. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎక్కడో దాక్కొని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారంటూ గంటాను ఉద్దేశించి సీరియస్ అయ్యారు.

టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారన్న అయ్యన్నపాత్రడు.. టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసింది.. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారని చెప్పారు. సాఫ్ట్ వేర్ కంపెనీ.. హార్డ్ వేర్ కంపెనీలే కాదు.. అండర్ వేర్ కంపెనీలు కూడా పోతున్నాయని జగన్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసిన అయ్యన్న.. జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారు. రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక పోలీసులపై కూడా అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధికారంలో వచ్చాక పోలీసుల పని పడతానని హెచ్చరించారు. ‘దౌర్భాగ్యులంతా జైలుకెళ్తారు. అప్పుడు ఈ పోలీసులు అంతా మా చ*లే నాకాలి. నాకు హోమ్ మినిస్ట్రీ ఇస్తే అప్పుడు షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇస్తా. దౌర్జన్యాలకు పాల్పడిన పోలీసుల లిస్టు రెడీ చేస్తా.. నా కొడుకుల సంగతి అప్పుడు తేలుస్తా’ అంటూ రెచ్చిపోయారు.