Vallabhaneni Vamsi: కళ్ళు చిదంబరం అద్దం ముందు నిలబడి మహేష్ బాబు అనుకుంటే అయిపోతారా?

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 03:10 PM

Vallabhaneni Vamsi: కళ్ళు చిదంబరం అద్దం ముందు నిలబడి మహేష్ బాబు అనుకుంటే అయిపోతారా?

Vallabhaneni Vamsi: కళ్ళు చిదంబరం అద్దం ముందు నిలబడి మహేష్ బాబు అనుకుంటే అయిపోతారా?.. అరగుండు బ్రహ్మానందం, అంకుశం రామిరెడ్డి మహేష్ బాబు అనుకుంటే మహేష్ బాబులు అయిపోతారా? అద్దం ముందు నిలబడి చూసుకుంటే ఎవరేంటో తెలుస్తుంది. ఇదీ కృష్ణా జిల్లా వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు గురించి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు. సినిమా డైలాగులలా పొలిటికల్స్ కామెంట్స్ చేస్తూ వల్లభనేని దుమ్ముదులిపేశారు.

ఇంతకు ఏమైందంటే.. వైఎస్సార్‌సీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ఎమ్మెల్యేలు కొడాలి నానీ, వల్లభనేని వంశీలపై మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో గన్నవరం ఎమ్మెల్యేలు వంశీ, నానిలపై ఇద్దరు నేతలు చేసిన కామెంట్స్ కలకలంరేపాయి. ఆ కొడాలి నానీ గాడేమో ఏడో తరగతి ఫెయిల్ అని.. వాడు పెద్ద హీరోలా ఫీలవుతాడని.. విలన్ ఎప్పుడూ హీరో కాడని అంటూ ఆ ప్రైవేట్ వీడియోలో మాట్లాడారు.

ఎమ్మెల్యే వంశీ గురించి కూడా ఓ రేంజి కామెంట్స్ చేశారు. వాడేం చేసి డబ్బు సంపాదించాడని.. వాడేంట వీడెంట తిరిగి నాలుగు రూపాయలు సంపాదించి ఇప్పుడు హీరోలా ఫీలవుతున్నాడని ఏదేదో మాట్లాడారు. దీనిపై స్పందించిన వంశీ కొందరు పనీ పాట లేని వాళ్లు ఏదో ఒకటి మాట్లాడతారని.. ఈ వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకుని వెళ్ళాల్సి అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు ఏం మాట్లాడారో తాను ఇంకా చూడలేదని.. వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు, కొడాలి నానికి తెలుసన్నారు. మరోసారి ఎక్కువగా మాట్లాడితే డొక్క పగలగొట్టి డోలు కడతామని వార్నింగ్ ఇచ్చారు. వార్డుకు, పంచాయతీకి గెలవని వాళ్లు తనకు సహకరించేది ఏంటని సెటైర్లు పేల్చారు. వంశీని, కొడాలి నానిని తిడితే పెద్ద వాళ్లం అవుతున్నామని అనుకుంటున్నారన్నారు. టీడీపీలో తాను, నాని ఎలా ఉన్నామో వైఎస్సార్‌సీపీలో కూడా తమ స్టైల్ అలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు.