Viveka Murder Case: క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మించి ట్విస్టులు.. మరో కోణం బయటపెట్టిన ఎంపీ అవినాష్!

Kaburulu

Kaburulu Desk

March 11, 2023 | 01:23 PM

Viveka Murder Case: క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మించి ట్విస్టులు.. మరో కోణం బయటపెట్టిన ఎంపీ అవినాష్!

Viveka Murder Case: దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ మునుపెన్నడూ లేని దూకుడు ప్రదర్శిస్తుంది. సీబీఐ ఎంత దూకుడుగా ముందుకు వెళ్తుందో అంతే దూకుడుగా కొత్త కోణాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఎంపీ వైఎస్ అవినాష్ ను విచారించిన సీబీఐ అధికారులు.. తాజాగా శుక్రవారం మరోసారి కూడా ఆయన్ను విచారించారు. ఈ సందర్భంగా అవినాష్ మరో కొత్త కోణాన్ని సీబీఐ అధికారుల ముందు బయటపెట్టినట్లు తెలుస్తుంది.

వివేకా రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించే ప్రక్రియలో.. ఆయన హత్య జరిగి ఉండొచ్చని ఎంపీ అనుమానం అనుమానం వ్యక్తం చేశారు. 2010లో షేక్ షమీమ్ అనే ముస్లిం మహిళను వివేకా వివాహం చేసుకున్నారని.. 2015లో షమీమ్, వివేకాకు కొడుకు పుట్టడంతో వారు తమ కుటుంబం నుంచి దూరంగా ఉండాలంటూ సునీత బెదిరించిందని.. సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంలో కూడా షమీమ్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిందని అవినాష్ సీబీఐకి తెలిపినట్లు తెలుస్తుంది.

అంతేకాదు, రెండో వివాహం తర్వాత వివేకా చెక్ పవర్‍ను తొలగించారమీ.. సునీత, వివేకా సతీమణి హైదరాబాద్‍లో ఉంటే.. వివేకానంద రెడ్డి ఒంటరిగా పులివెందులలో ఉండేవారని చెప్పగా. షమీమ్‍కు పుట్టిన కుమారుడిని వారసుడిగా ప్రకటిస్తారని చర్చ జరిగిన నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని.. హత్య తర్వాత నిందితులు వివేకా ఇంట్లో డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు షమీమ్ చెప్పడం దీనికి బలం చేకూరుస్తుందని అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇన్ని రోజులు తాను మౌనంగా ఉండటంతో పార్టీ క్యాడర్ తనను ప్రశ్నిస్తోందని… ఇక నుంచి మాట్లాడటం మొదలుపెడతానన్నారు అవినాష్ రెడ్డి. వివేకాది మర్డర్ ఫర్ గెయిన్ అని వ్యక్తం చేసిన అవినాష్.. ముస్లిం మహిళకు పుట్టిన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకా నిర్ణయం తీసుకున్నారని.. ఆయన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నారని కూడా అవినాష్ వెల్లడించడంతో ఈ కేసులో మరో ట్విస్ట్ తిరుగనుందా అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.