America Florida: ముగ్గురు కలిసి శృంగారం.. యువతులు జెలసీతో ఒకరిపై ఒకరు దాడి.. చివరికి జైలు పాలు!

Kaburulu

Kaburulu Desk

March 11, 2023 | 11:19 PM

America Florida: ముగ్గురు కలిసి శృంగారం.. యువతులు జెలసీతో ఒకరిపై ఒకరు దాడి.. చివరికి జైలు పాలు!

America Florida: మన దేశంలో శృంగారం అనే పదాన్ని ఇంగ్లీష్ లో చెప్పేందుకు కూడా ఇప్పటికీ కొందరు తప్పుగానే భావిస్తారు. అయితే, ఇప్పుడిప్పుడే కొన్ని మెట్రో నగరాలలో విషసంస్కృతి మొదలవుతుంది. డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా పుణ్యమా అని.. అపరిచిత వ్యక్తులతో శృంగారం, వన్ నైట్ స్టాండ్ అని.. గ్రూప్ సెక్స్ అని.. త్రీ సమ్, ఫోర్ సమ్ అని చెప్పుకొనేందుకు కూడా సిగ్గుపడేలా వికృత చేష్టలకు దిగుతున్నారు.

మన దగ్గర అంటే ఇలాంటివి కొత్తేమో కానీ.. అమెరికా లాంటి దేశాలలో ఇది జస్ట్ క్యాజువల్ అనేలా ఉంటుంది. నచ్చిన వాళ్ళతో నచ్చినట్లు ఇక్కడ ఈ శృంగార క్రీడ సాగుతుంది. అలాగే అమెరికాలోని ఫ్లోరిడాలో ముగ్గురి మధ్య సాగిన శృంగారకాండ మధ్యలోనే భంగమై చివరికి జైలు పాలు కావాల్సి వచ్చింది. ఏదో కొత్త అనుభూతిని చూడాలనుకున్న ఆ ముగ్గురికి పోలీసులు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు.

ఫ్లోరిడాలోని మౌనోర్ కంటీలోని కీస్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల స్టీవెన్‌ లోపెజ్ కు 20 ఏళ్ల ఏంజెలా వివియానా అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది. అమెరికాలో గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అంటే చెప్పేదేముంది. చూడాల్సిందంతా కొన్ని రోజులకే చూసేశారు. అదే క్రమంలో వీరికి 29 ఏళ్ల వయసున్న మరో వివాహిత పరిచయమైంది. ఆమెతో ఈ ఇద్దరికీ మనసులు బాగా కలవడంతో లోపెజ్‌కు వెర్రి కోరిక పుట్టింది. ఎప్పుడూ ఇద్దరమేనా ఓసారి ఆమెను కూడా కలుపుకుందామని ఏంజెలాకు చెప్పాడు.

ఆమె కూడా నిజమే కదా అని తమ ఫ్రెండుకు విషయం చెప్పింది. దానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పీ చెప్పగానే ఆమె కూడా ఒకే అంది. ముగ్గురూ కలిసి రసపట్టులో ఉండగా ఏంజెలా అక్కసుతో వివాహితపై తిట్ల వర్షం మొదలు పెట్టింది. ప్రియుడు కూడా ఆమెకు వత్తాసు పలకడంతో అతనికి ఒక రౌండ్ తిట్టిపోసింది. దీంతో వివాహిత, అతను కలిసి ఆమెపై దాడి చేశారు.. ఆమె కారును ఇటుకలతో ధ్వంసం చేశారు. దీంతో హార్ట్ అయిపోయిన గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీన్ కట్ చేస్తే స్టీవెన్, ఏంజెలాను అరెస్ట్ చేసి జైల్లో పడేశారు.