Union Budget: ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. అడ్డుకొని తీరతాం.. బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే!

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 05:56 PM

Union Budget: ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. అడ్డుకొని తీరతాం.. బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే!

Union Budget: నేడు కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై వివిధ రాష్ట్రాల నుండి ఒక్కోరకంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీ ఆర్థికశాఖ మంత్రి మాట్లాడుతూ కొన్ని శాఖలలో కేటాయింపులు తగ్గాయి కానీ.. ఓవరాల్ గా చూస్తే మంచి బడ్జెట్ అని.. రాజకీయాలను పక్కనబెట్టి అందరూ కేంద్రాన్ని ప్రశంసించాలని కూడా కోరారు. అయితే, తెలంగాణ నేతలు మాత్రం ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు.

బుధవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర బడ్జెట్ 2023పై బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కేం ద్ర బడ్జెట్‌పై నామా నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ గా ఆయన పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కూడా చూపడం లేదని ఈ బడ్జెట్ తో తేటతెల్లమైందని ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరుతూ పార్లమెంట్ లో పోరాటం చేస్తామని నామా నాగేశ్వరరావు ప్రకటించారు.

ఎన్నో ఆశలతో ఈ బడ్జెట్ కోసం ఎదురు చూశారని, కానీ రైతులకు అనుకూలంగా ఈ బడ్జెట్‌లో ఏమీ లేదని వ్యాఖ్యానించారు. అగ్రికల్చర్.. డిజిటల్ అగ్రికల్చర్‌తో అభివృద్ధి కాదని అభిప్రాయపడ్డారు. గత 9 ఏళ్లలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎంఎస్పీ గురించి ఒక్క మాట మాట్లాడలేదని దుయ్య బట్టారు. బడ్జెట్ మిల్లెట్స్ చుట్టూ తిప్పారన్నారు. మాయ మాటలు, మోసపు మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కర్ణాటకలోనే కరువు ఉందని బీజేపీ చెప్తోందని ఫైర్ అయ్యారు.

అసలు ఈ ఈ బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పన ఏదని నామా నిలదీశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, ప్రాజెక్టులకు అనుమతులు కూడా ఇవ్వట్లేదని బీజేపీపై నిప్పులు చెరిగారు. రూరల్ డెవప్మెంట్ ఏమైందని ప్రశ్నించిన ఆయన.. గ్రామ అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతున్నా రు. తాము పార్లమెంట్‌లో ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తామన్నారు.