Viral Video: భారీ భూకంపం దెబ్బకు ఊగిపోతున్న స్టూడియో.. అయినా వార్తలు చదవడం ఆపని యాంకర్!

Viral Video: మంగళవారం రాత్రి ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతతో నమోదైన ఈ భూకంపంలో 11 మంది మృతి చెందారు. భూకంప ప్రకపంనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భారీ శబ్దాలకు తోడు బిల్డింగులు ఊగిపోవడంతో ఇళ్లలోని ప్రజలు రోడ్ల మీదకి పరుగులు తీశారు. ఎక్కడెక్కడో పై అంతస్థులలో ఉన్నవారు కూడా పరుగులు పెట్టి రోడ్ల మీదకి వచ్చారు.
అయితే, ఓ న్యూస్ ఛానెల్ స్టూడియోలో వార్తలు చదువుతున్న న్యూస్ యాంకర్ మాత్రం కదల్లేదు. భూకంపం ప్రభావంతో స్టూడియో మొత్తం ఊగిపోతున్నా.. స్టూడియోలో ఉన్న మిగతా సిబ్బంది పరుగులు పెడుతున్నా న్యూస్ యాంకర్ మాత్రం చదవడం ఆపలేదు. లైవ్ న్యూస్ కావడంతో స్టూడియో ఊగిపోవడం.. న్యూస్ యాంకర్ ఆపకుండా వార్తలు చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
భూకంపం ప్రభావంతో ఇళ్లు, కార్యాలయాల్లో వస్తువులు పడిపోతున్న వీడియోలు, సీలింగ్ ఫ్యాన్లు ఊగిపోతున్న వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. అయితే, ఈ న్యూస్ యాంకర్ వీడియో మాత్రం నెటిజన్లను విస్తుగొలుపుతోంది. పాకిస్థాన్ పెషావర్‌లోని మాష్రిక్ టీవీ స్టూడియోకు సంబంధించిన వీడియో ఇది. న్యూస్ యాంకర్ వార్తలు చదువుతున్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. ఆ సమయంలో స్టూడియో ఒక్కసారిగా ఊగిపోయింది.
ప్రకంపనలతో వెనకున్న టీవీలు కూడా భయంకరంగా కదిలిపోయాయి. అక్కడే ఉన్న సిబ్బంది కూడా కొందరు భయంతో స్టూడియో నుంచి వెళ్లిపోతుండడం కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే, వార్తలు చదువుతున్న యాంకర్ మాత్రం ధైర్యాన్ని వీడలేదు. స్టూడియో మొత్తం కదులుతున్నా ఆ యాంకర్ మాత్రం వార్తలు చదవడాన్ని ఆపలేదు. అతడి ధైర్యాన్ని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం.. ఏం జరుగుతుందో అతనికి అర్ధంకాక అలా ఉన్నాడా.. అర్థమైనా ఏం కాదని ఉన్నాడా తెలియడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.
Pashto TV channel Mahshriq TV during the earthquake. Bravo anchor continued his live program in the ongoing earthquake.
#earthquake #Peshawar pic.twitter.com/WC84PAdfZ6
— InamAzal Afridi (@Azalafridi10) March 21, 2023