KCR Grandson Ritesh Rao: అసెంబ్లీ ముట్టడించిన కేసీఆర్ అన్న మనవడు మిస్సింగ్..!

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 09:05 PM

KCR Grandson Ritesh Rao: అసెంబ్లీ ముట్టడించిన కేసీఆర్ అన్న మనవడు మిస్సింగ్..!

KCR Grandson Ritesh Rao: సీఎం కే‌సీ‌ఆర్ అన్న మనవడు మిస్సింగ్ అయ్యాడని.. స్వయంగా అతని తల్లి ఆరోపణలు చేశారు. పోలీసులే తన కుమారుడిని అర్ధరాత్రి తీసుకు వెళ్లారనీ, అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదనీ ఆరోపించారు. ఈ విషయాన్ని రితేష్ తల్లి, కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు తెలిపారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి పోలీసులు తన కొడుకు రితేష్ ను తీసుకెళ్లారని, ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే విషయాన్ని చెప్పడం లేదని ఆమె ఆరోపించారు. సిటీ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లన్నీ గాలించినా తన కుమారుడి ఆచూకీ లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు?
రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం ఎన్ఎస్ యూఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘం) అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం తెలిసిందే. దాంతో పోలీసులు ఎన్ఎస్ యూఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిలో రమ్య రావు కుమారుడు రితేశ్ రావు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వారిని ఎక్కడికి తరలించారన్నది తెలియరాలేదు. మొత్తం 37 మంది కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి ప్రగతి భవన్ ను ముట్టడించగా.. వీరందరిపై కేసులు పెట్టిన పోలీసులు అందరినీ రిమాండ్ కు తరలించారు. వీరందరికీ 14 రోజుల రిమాండ్ విధించారు.

తన కుమారుడు ఎక్కడని డీజీపీని ప్రశ్నించిన రితేష్ తల్లి..
తన కుమారుడు రితేశ్ రావు ఆచూకీ తెలియడంలేదంటూ రమ్యరావు డీజీపీని ఆశ్రయించారు. పోలీసులే తన కుమారుడ్ని ఎత్తుకెళ్లి, అరెస్ట్ చేసినట్టు చూపించడంలేదని రమ్య రావు ఆరోపించారు. తన కుమారుడు ఎక్కడున్నాడో చెప్పాలని అన్నారు. అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత రెండు వాహనాల్లో పోలీసులు ఇంటితో పాటు భవనం పైనున్న వాటర్ ట్యాంక్ కూడా వెతికి తీసుకెళ్లారని.. ఇప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడో అధికారికంగా సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.