Bike Blast In Petrol Pump: పెట్రోల్ బంకులో పేలిన బైక్.. అందరూ చూస్తుండగానే వ్యక్తి సజీవ దహనం!

Bike Blast In Petrol Pump: వేసవి కాలంలో అప్పటి వరకు బాగానే నడిచిన కార్లు, బైకులలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దహనమైపోతుంటాయి. ఈ ఘటనలలో అప్పుడప్పుడు ప్రాణనష్టాలు కూడా భారీగానే ఉంటాయి. ఇక, పెట్రోల్ బంకులలో కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటిది పెట్రోల్ పంపు వద్ద పెట్రోల్ నింపుతున్నప్పుడు బైక్ లో మంటలు చెలరేగి అది పేలిపోతే ఊహించేందుకు కూడా ఈ ఘటన ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒక పెట్రోల్ బంక్‌లో పంప్ ఇరుక్కుని బైక్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్య క్తి సజీవదహనం అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ కొట్టించుకోవడం కోసం బైక్ మీద ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లారు. అక్కడ తమ బైక్‌లో పెట్రోల్ కొట్టించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరేందుకు కొంచెం ముందుకు వెళ్లారు.
బైక్ నడుపుతున్న వ్యక్తి బైక్ స్టార్ట్ చేసి కొద్దిగా ముందుకు వెళ్లగా.. అప్పటికే పంప్ బైక్ ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో వెనకాల కూర్చున్న వ్యక్తి అది గమనించి ఆ పంప్ తీసేందుకు కిందకు దిగాడు. వెనక వ్యక్తి అలా దిగాడో లేదో ఆ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు తీయగా బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మాత్రం ఈ ఘటనలో సజీవదహనం అయ్యాడు. బైక్, అతనితో పాటు మంటలు పక్కనే ఉన్న బూత్‌కి సైతం అంటుకున్నాయి.
దీంతో పెట్రోల్ బంక్ సిబ్బందితో పాటు ఆఫీస్‌లోని స్టాఫ్ కూడా అక్కడి నుంచి
ప్రాణభయంతో పారిపోయారు. వెంటనే ఫైరింజన్లకు సమాచారం అందించి, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది అనే వివరాలు ఇంకా తెలియలేదు కానీ.. వీడియో చూస్తే పెట్రోల్ బంకులోకి వెళ్లేందుకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.