Poyd Treechada-Oak Bhavagha Hongyok: ట్రాన్స్ జెండర్ నటిని పెళ్లాడిన బడా బిజినెస్ మెన్!

Poyd Treechada-Oak Bhavagha Hongyok: ట్రాన్స్ జెండర్, నటి, మోడల్ పోయ్డ్ ట్రీచాడా పెట్చరత్.. థాయిలాండ్ బడా వ్యాపారవేత్త ఓక్ భవఘా హాంగ్యోక్‌ను వివాహం చేసుకున్నారు. ఫుకెట్ బాన్ అర్-జోర్‌లో జరిగిన ఈ వేడుక సాంప్రదాయ పెరనాకన్ శైలిలో జరిగింది. ఈ ప్రదేశం ఆరు శతాబ్దాల క్రితం ఈ ప్రాంతానికి చైనీస్ వలసదారులతో ఉద్భవించిందని ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.
కాగా, 36 ఏళ్ల పోయిడ్ థాయ్‌లాండ్‌లోని ఫెంగ్‌నాలో 1986లో పోయిడ్ జన్మించారు. మగబిడ్డగా పుట్టినప్పటికీ పెద్దయ్యాక అమ్మాయి లక్షణాలు కనిపించడంతో పదిహేడేళ్ల వయసులో లింగమార్పిడి ద్వారా అమ్మాయిగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. 2004లో మిస్ టిఫనీ, మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ పోటీలను గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
అప్పటి నుండి, ఆమె థాయ్‌లాండ్, ఇతర సినీ పరిశ్రమలలో ప్రముఖ వ్యక్తిగా మారింది, మోడల్‌గా, నటిగా బిజీగా మారిన పోయిడ్ 2013లో హాంకాంగ్ సినిమాల్లో కూడా ప్రవేశించారు, అక్కడ ఆమె హాంకాంగ్ తారలతో కలిసి పనిచేసింది. మరోవైపు పోయిడ్ అద్భుతమైన అందంతో సూపర్ మోడల్‌గా కూడా గుర్తింపు పొందారు. ఆమెకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టాలో ఆమెకు 26 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
తొలిసారి 2010లో ‘విత్ లవ్’ సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించిన పోయిడ్.. ‘స్పైసీ బ్యూటీ క్వీన్ బ్యాంకాక్-2’ ఫిల్మ్ సిరీస్‌లోనూ నటించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. పోయిడ్ ఆరేళ్లలో ఆరు సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ భారీస్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. ఇక, వరుడు ఓక్ విషయానికి ఆయన కుటుంబ పితామహుడు టాన్ జిన్ న్గువాన్ – చైనీస్ వలసదారుడు కాగా, అతను ప్రావిన్స్‌లో టిన్ మైనింగ్‌ను ప్రారంభించి వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ప్రస్తుతం ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని ఓక్ చూసుకుంటున్నాడు.