Shobana : కేదార్‌నాథ్‌‌లో చిక్కుకుపోయిన సీనియర్ హీరోయిన్…

Kaburulu

Kaburulu Desk

November 30, 2022 | 11:20 AM

Shobana : కేదార్‌నాథ్‌‌లో చిక్కుకుపోయిన సీనియర్ హీరోయిన్…

Shobana :  ఒకప్పటి స్టార్ హీరోయిన్, క్లాసికల్ డ్యాన్సర్ శోభన 90వ దశకంలో అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ క్లాసికల్ డ్యాన్సర్ గా పాఠాలు చెప్తుంది. కొన్ని రోజుల క్రితం శోభన ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రమైన కేదార్‌నాథ్‌కు వెళ్లారు.

కేదార్‌నాథ్‌ ఎప్పుడూ మంచుతోనే ఉంటుంది. అక్కడి వాతావరణ పరిస్థితులని ఎవరూ అంచనా వేయలేరు. అయితే శోభన కేదార్‌నాథ్‌ దేవాలయాన్ని సందర్శించుకున్న అనంతరం తిరిగి వద్దామనుకుంటే అక్కడ వాతావరణ పరిస్థితులు బాగోలేవు. దీంతో శోభన అక్కడి వాతావరణం గురించి చెబుతూ ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Chandramukhi 2 : చంద్రముఖిగా కంగనా రనౌత్.. ఎలా చేస్తుందో??

శోభన ఈ వీడియోలో మాట్లాడుతూ.. ”కేదార్‌నాథ్‌ లో వాతావరణం చాలా కఠినంగా ఉంది. పొగమంచు చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల నాకు జలుబు చేసింది. దట్టమైన పొగమంచు వల్ల హెలికాప్టర్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం దాని కోసమే ఎదురుచూస్తున్నాను. మంచు తగ్గాక, హెలికాఫ్టర్ రాగానే బయలుదేరుతాను. మళ్ళీ వివరాలని అప్డేట్ చేస్తాను” అని తెలిపింది. చివర్లో ఇలా చెప్తుంటే న్యూస్ రీడర్ చదివినట్టు ఉంది కదా అని నవ్వేసింది. ఇక అభిమానులు, నెటిజన్లు ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు.