Samantha : అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత.. ఆ వ్యాధితో బాధపడుతున్నానంటూ పోస్ట్ చేసిన సామ్..

Kaburulu

Kaburulu Desk

October 31, 2022 | 08:54 AM

Samantha : అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత.. ఆ వ్యాధితో బాధపడుతున్నానంటూ పోస్ట్ చేసిన సామ్..

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. తన చేతిలో దాదాపు అరడజనుకి పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. చైతూతో విడాకుల తర్వాత కెరీర్ మీద ఫోకస్ చేసింది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండేది. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కానీ గత కొన్ని నెలలుగా సడెన్ గా సోషల్ మీడియా నుంచి మాయమైపోయింది. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో సమంత ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంతా అనుకున్నారు.

త్వరలో తన యశోద సినిమా రిలీజ్ కాబోతుంది. సమంత మెయిన్ లీడ్ లో చేసిన యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ నవంబర్ 11న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి సమంత బయటకి వస్తుందేమో అనుకున్నారు అంతా. తాజాగా ఈ సినిమాకి డబ్బింగ్ చెప్తున్న ఫోటో షేర్ చేస్తూ అందరిని షాక్ కి గురిచేసే విషయాన్ని తెలిపింది. ఈ ఫొటోలో సమంత సెలైన్ పెట్టుకొని మరీ డబ్బింగ్ చెప్తుంది.

సమంత తన ఫోటోని షేర్ చేస్తూ.. ”నేను గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను. కొన్ని నెలల నుంచి నేనొక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. నాకు మయోసైటిస్ అనే వ్యాధి సోకింది. నరాలకు, ఎముకలకు సంబంధించింది ఈ వ్యాధి. దీనికి నేను చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడుతోంది. కాకపోతే ఇంకొంచెం టైం పడుతుంది. త్వరలోనే కోలుకుంటాను. లైఫ్ లో అందరికి మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. చెడ్డ రోజులు తొందరగానే వెళ్లిపోతాయి. ఇది కూడా అంతే. తొందరగా కోలుకొని మీ అందరిముందుకు త్వరలో వస్తాను” అని పోస్ట్ చేసింది.

Ali : అలీతో సరదాగా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కచ్చితంగా వస్తారు..

సమంత మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలియడంతో సమంత అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు తను త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు.