RGV : నేను పవన్ అభిమానిని.. అది వాళ్లకి అర్ధం కావట్లేదు..

ప్రస్తుతం ఆర్జీవీ కాకినాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితమే మొదటి సారీ ఏపీలో ప్రత్యక్షంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నాను, ఇది ఏ పార్టీ కోసం కాదు, నన్ను ద్వేషించే పార్టీల కోసం చెప్తున్నా అని ట్వీట్ చేశాడు. తాజాగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే..................

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 03:14 PM

RGV : నేను పవన్ అభిమానిని.. అది వాళ్లకి అర్ధం కావట్లేదు..

RGV :  డైరెక్టర్ ఆర్జీవీ నిత్యం వార్తల్లో, వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. అయన చేసే ట్వీట్స్ తోనో, వ్యాఖ్యలతోనో వైరల్ గా మారుతూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్, జనసేనపై వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడిన స్పీచ్ కి కౌంటర్ గా కొన్ని ట్వీట్స్ చేశాడు ఆర్జీవీ. దీంతో నాగబాబు ఆర్జీవిపై సీరియస్ అయ్యారు. దీనికి ఆర్జీవీ కౌంటర్ ఇస్తూ.. నేను పవన్ అభిమానినే, ఆయన మంచికోసం చెప్తున్నాను అని పోస్ట్ చేసి నాగబాబు లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు ఆర్జీవీ.

ప్రస్తుతం ఆర్జీవీ కాకినాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితమే మొదటి సారీ ఏపీలో ప్రత్యక్షంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నాను, ఇది ఏ పార్టీ కోసం కాదు, నన్ను ద్వేషించే పార్టీల కోసం చెప్తున్నా అని ట్వీట్ చేశాడు. తాజాగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు, కోడి పందాలలో ఆర్జీవీ పాల్గొన్నారు.

BRS: సభకు 100 ఎకరాలు.. పార్కింగ్‌కు 400 ఎకరాలు.. బీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు!

అలాగే కాకినాడలో ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ మీద ట్వీట్స్ చేస్తే ఆయన మంచికోసమే చేస్తున్నా. నా ట్వీట్స్ వాళ్ళకి అర్ధం కావట్లేదు. బుద్ది ఉన్న వాళ్లకి అర్ధం అవుతుంది. జనసేనలో కూడా నా అభిమానులు ఉన్నారు. ఇక్కడ కాకినాడలో కూడా జనసేన నాయకులని నేను కలిశాను. వారు నాతో బాగానే ఉన్నారు. నేను మాట్లాడేది పవన్ మంచి కోసమే, పవన్ మీద అభిమానంతోనే, ఇది అర్ధం కానీ వాళ్ళే నా మీద విమర్శలు చేస్తున్నారు అని అన్నారు. దీంతో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు జనసేనలోనూ, పవన్ అభిమానుల్లోనూ చర్చకి దారి తీశాయి.