RGV : కేసీఆర్ బయోపిక్ తీస్తాను

Kaburulu

Kaburulu Desk

October 13, 2022 | 01:12 PM

RGV : కేసీఆర్ బయోపిక్ తీస్తాను

RGV :  సంచలనాల దర్శకుడు ఆర్జీవీ ఎప్పుడూ వార్తల్లో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన చేసే ట్వీట్స్, ఆయన చేసే సినిమాలు, ఇంటర్వ్యూలలో ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ తో నిత్యం వార్తల్లో ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. గతంలో ఆర్జీవీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన అడవి సినిమాని రీ రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఆర్జీవీ తన తదుపరి సినిమాల గురించి మాట్లాడారు.

ఈ ప్రెస్ మీట్ లో ఆర్జీవీ మాట్లాడుతూ.. అడవి సినిమాలో సౌండ్స్, ఫారెస్ట్ ఫోటోగ్రఫీ బాగుంటాయి. ఈ సినిమాని త్వరలో రీ రిలీజ్ చేయబోతున్నాము. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. దానికి ఇంకా పేరు పెట్టలేదు. అలాగే కేసీఆర్ గారి బయోపిక్ తీసే ప్లాన్ లో ఉన్నాను. అది ఎలక్షన్స్ కి ముందే ఉంటుంది. కానీ ఆ సినిమా కేసీఆర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలీదు” అని తెలిపారు.

Allu Arjun : కేంద్రమంత్రి చేతుల మీదుగా ఇండియన్ అఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

గతంలోనే ఆర్జీవీ కేసీఆర్ బయోపిక్ తీస్తాను అని ప్రకటించారు. తాజాగా మరోసారి ఆర్జీవీ కేసీఆర్ బయోపిక్ తీస్తాను అని, అది కూడా ఎలక్షన్స్ ముందే ఉంటుందని చెప్పడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ వార్త చర్చగా మారింది.