Rambha : రంభ కారుకి యాక్సిడెంట్.. ఆసుపత్రిలో కూతురు.. దెబ్బలతో బయటపడ్డ రంభ

Kaburulu

Kaburulu Desk

November 1, 2022 | 08:21 AM

Rambha : రంభ కారుకి యాక్సిడెంట్.. ఆసుపత్రిలో కూతురు.. దెబ్బలతో బయటపడ్డ రంభ

Rambha :  ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో లైఫ్ ని గడుపుతుంది. తన పిల్లలతో ఉంటూ ఫ్యామిలీ పర్సన్ లా ఉండిపోయింది. తన పిల్లలని తానే స్కూల్ కి తీసుకెళ్లి తీసుకువస్తుంది రంభ. సోమవారం సాయంత్ర తన పిల్లలని స్కూల్ నుంచి తీసుకొస్తుండగా రంభ కారుకి యాక్సిడెంట్ అయింది.

Priyanka Chopra : మూడేళ్ళ తర్వాత ఇండియాకి వచ్చిన ప్రియాంక చోప్రా..

రంభ తన కారు యాక్సిడెంట్ ఫొటోలు తీసి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”నేను నా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే వేరే కారు వచ్చి గుద్దేసింది. మేమంతా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాం. కానీ నా కూతురు సాషా హాస్పిటల్ లో ఉంది. ఇంకా హాస్పిటల్ లో ఉండి చికిత్స తీసుకుంటుంది. బ్యాడ్ డే, బ్యాడ్ టైం. తను త్వరగా కోలుకోవాలని నా కోసం ప్రార్ధించండి” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. దీంతో రంభ అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు రంభ కూతురు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.