AP Capital: మాది ఆంధ్రప్రదేశ్.. మా రాజధాని విశాఖ.. జోష్ పెంచిన ఉత్తరాంధ్ర నేతలు!

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 03:41 PM

AP Capital: మాది ఆంధ్రప్రదేశ్.. మా రాజధాని విశాఖ.. జోష్ పెంచిన ఉత్తరాంధ్ర నేతలు!

AP Capital: నిన్నటి వరకు ఏపీకి రాజధాని లేదని కొంతమంది వెటకారంగా మాట్లాడారు కదా.. ఇప్పుడు చెప్తున్నాం వాళ్లందరికీ.. మాది ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి.. గుర్తుపెట్టుకోండి అంటూ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పుడు ఘాటు పెంచి సమాధానం చెప్తున్నారు. శాసన పరంగా, అధికారికంగా రాజధాని విశాఖ కాకపోయినా.. సీఎం జగన్ ఢిల్లీలో విశాఖనే రాజధానని ప్రకటించిన నేపథ్యంలో ఇలా జోష్ పెంచారు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు.

శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు జాతీయ రహదారి సమీపంలో వైసీపీ కార్యాలయం నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అయన.. రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లేందుకు అనేక అధ్యయనాలు చేసి విశాఖని పరిపాలనా రాజధానిగా నిర్ణయించామని.. అన్ని ప్రాంతాల వారిని ఒకేరీతిలో చూడాలనేధి మా భావనని పేర్కొన్నారు. అందుకే వికేంద్రీకరణ చేయాలనుకున్నామని.. కానీ కొందరు కోర్టులకు వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అఫీషియల్ గా సీఎం జగన్ స్వయంగా చెప్పారు కనుక విశాఖనే మన రాజధాని అని.. అతి త్వరలో శుభ ముహూర్తాన విశాఖలో సీఎం జగన్ అడుగు పెట్టబోతున్నారని చెప్పారు.

గూగుల్ సెర్చ్ లో చూసినా విశాఖనే ఏపీకి రాజధాని అని చూపిస్తుందని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. విశాఖ రాష్ట్ర రాజధానిగా నిర్ణయించబడుతుతుందని సీఎం జగన్ మంచి ప్రకటన చేశారని.. సీఎం ప్రకటనతో రాష్ట్ర ప్రజలంతా సంతోషాన్ని తెలియపరుస్తున్నారని.. జగన్ నిర్ణయం అద్బుతం .. ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. అన్ని రకాలుగా కనెక్టివిటీ హబ్ గా విశాఖ ఉంది.

పారిశ్రామిక దిగ్గజాలు సైతం విశాఖపై ఆసక్తి చూపుతున్నారన్న తమ్మినేని.. విశాల తీర ప్రాంతం ఇండస్ట్రియల్ కారిడార్ గా మారబోతుందని చెప్పారు. జగన్ లాంటి గొప్ప నాయకుడు మహా నాయకుడు లేడు రాడని ఆకాశానికి ఎత్తేసిన తమ్మినేని.. చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీ చేశారని.. సోనియాతో కుమ్మక్కై .. సింహాన్ని బంధించినట్లు బంధించారని.. ఆ సింహం బోను లోంచి వచ్చి చీల్చి చీల్చి పడేసిందని చెప్పారు.