AP High Court: ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. ఆమోదముద్రే బ్యాలెన్స్!

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 11:39 PM

AP High Court: ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. ఆమోదముద్రే బ్యాలెన్స్!

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు రానున్నారు. ఇప్పటికే జ్యుడీషియల్ అధికారుల కోటా నుంచి ఎంపిక పూర్తి కాగా.. ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం ఈ మేరకు పేర్లను సిఫారసు చేయగా.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.

జ్యుడీషియల్ అధికారుల కోటా నుంచి ఎంపికైన జాబితా నుండి.. కేంద్రంలోని కిరణ్ రిజిజు సారథ్యంలోని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. సాధారణంగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం యధాతథంగా ఆమోదిస్తుంటుంది. ఏవైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఈ సిఫారసులను, ప్రతిపాదనలను తిప్పి పంపిస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే ఇలాంటి సందర్భాలు చాలా అరుదు.

అయితే, ఏపీ హైకోర్టు కోసం ఇద్దరు జ్యుడీషియల్ అధికారులను సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తులుగా లిస్ట్ అవుట్ చేయగా.. కేంద్ర న్యాయ శాఖ ఆమోద ముద్ర బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం జ్యుడీషియరీ అధికారులుగా పని చేస్తోన్న పీ.వెంకట జ్యోతిర్మయి, వీ.గోపాలకృష్ణ రావులను ఏపీ హైకోర్టులో న్యాయమూర్తులుగా లిస్ట్ అవుట్ చేస్తూ కొలీజియం సిఫారసులను కేంద్రానికి పంపించింది. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టుకు ఏడుమంది న్యాయమూర్తులను నియమించిన విషయం తెలిసిందే.

వీరిలో అడుసుమిల్లి తల్లాప్రగడ మల్లికార్జున రావు, దుప్పల వెంకటరమణ, వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ, కృపా సాగర్, శ్యామ్ సుందర్ బండారు, బొపన్న వరహా లక్ష్మీనరసింహ చక్రవర్తి, శ్రీనివాస్ ఊటుకూరు ఉండగా గత ఏడాది జులై 20వ తేదీన వారిని నియమించింది. తాజాగా పీ.వెంకట జ్యోతిర్మయి, వీ.గోపాలకృష్ణ రావులను లిస్ట్ అవుట్ చేసింది. దీనితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. అయినా మరో నాలుగు స్థానాలు ఖాళీగా ఉండగా.. త్వరలోనే అవి కూడా భర్తీ ఛాన్స్ ఉందని తెలుస్తుంది.