Viral News: అర్ధరాత్రి నగ్నంగా తిరిగే యువతి.. ఇంటి కాలింగ్ బెల్ కొట్టడం, డోర్లు తట్టడం!

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 01:00 PM

Viral News: అర్ధరాత్రి నగ్నంగా తిరిగే యువతి.. ఇంటి కాలింగ్ బెల్ కొట్టడం, డోర్లు తట్టడం!

Viral News: సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల 50 నిమిషాల సమయం. ఒంటి మీద నూలుపోగు లేకుండా ఓ యువతి రోడ్లపై తిరుగుతుంది. అంతేకాదు కనిపించిన ప్రతి ఇంటి ముందున్న కాలింగ్ బెల్ కొట్టడం.. డోర్లు తట్టడం చేస్తుంది. అర్ధరాత్రి గాఢ నిద్ర సమయం కావడంతో కొందరు ఆలస్యంగా నిద్రలేచి తలుపులు తీసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. ఈలోగా ఆ యువతి మరో ఇంటి ముందు బెల్ కొడుతోంది. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి.

అయితే.. తాజాగా ఆ యువతి అలాగే అర్ధరాత్రి ఓ ఇంటి కాలింగ్ బెల్ కొట్టగా ఇంట్లో వాళ్ళు తలుపు తీశారు. అంతే గుండె ఆగినంత పనైంది. నగ్నంగా జుట్టు విరబోసుకొని ఓ యువతి కనిపించింది. ఇంట్లో వాళ్ళు దెయ్యమని తలుపులు మూసేసి ఉదయం వరకు మళ్ళీ తీయలేదు. మరుసటి ఉదయం ఈ ఘటనపై చుట్టుపక్కల వాళ్ళకి చెప్పగా అందరిదీ అదే పరిస్థితి అని ఓ ఇంటికి అమర్చి ఉన్న సీసీ కెమెరాలలో చెక్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లో మిలక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ కొన్ని రోజులుగా పలు ఇళ్ల ముందుకు వెళ్లి కాలింగ్స్ బెల్స్ మోగిస్తున్నట్టు, డోర్లను తడుతున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా ఓ స్థానికుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించి శనివారం రామ్ పూర్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

వీడియో మహిళను తాము గుర్తించామని, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడామని చెప్పారు. మానసిక అనారోగ్యంతో ఆమె బాధపడుతుండగా.. గత ఐదేళ్లుగా బరేలీలో ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్టు చెప్పారు. మరోసారి ఆ యువతి వీధుల్లోకి రాకుండా చూసుకుంటామని ఆమె తల్లిదండ్రులకు హామీ ఇచ్చారని.. అనవసరంగా లేనిపోని వదంతులు సృష్టించి వాటిని వ్యాప్తి చేయవద్దని ప్రజలకు సూచించారు.