Naga Shaurya Wedding : ఘనంగా హీరో నాగశౌర్య వివాహం..

Kaburulu

Kaburulu Desk

November 20, 2022 | 08:53 AM

Naga Shaurya Wedding : ఘనంగా హీరో నాగశౌర్య వివాహం..

Naga Shaurya Wedding :  టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తున్నాడు. ఇటీవల వచ్చిన కృష్ణ వ్రింద విహారి సినిమాతో చాలా రోజుల తర్వాత మంచి విజయం సాధించాడు నాగశౌర్య. కొన్ని రోజుల క్రితం తన పెళ్లి గురించి కుటుంబ సభ్యులు తెలిపారు.

బెంగుళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం జరగనుందని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం రాత్రి నాగశౌర్య, అనూష ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరగగా నేడు బెంగుళూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం జరిగింది.

Ira Khan : రెండేళ్ల డేటింగ్ తర్వాత.. ఘనంగా అమీర్ ఖాన్ కూతురి నిశ్చితార్థం..

నాగశౌర్య, అనూష శెట్టిల వివాహం నేడు ఉదయం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.