Asaduddin Owaisi: దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకు బానిసలు.. ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 11:52 AM

Asaduddin Owaisi: దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకు బానిసలు.. ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఎంపీ.. భారతదేశంలో ముస్లింలు ఏకతాటిపై వచ్చి రాజకీయంగా ఓ లీడర్‌షిప్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదు. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 70 సంవత్సరాల నుంచి మమ్మల్ని దోచుకున్నారు. ఈ దేశంలో అగ్రకులస్తులే రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారని ఆరోపించారు.

అంతేకాదు, మైనార్టీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు దళితులు ఏకితాటిపై రావడం రాజకీయ పార్టీలకి నచ్చదని విమర్శించారు. దేశంలో పార్టీలన్నీ కేవలం ముస్లిం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని, ఫలితంగా ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసదుద్దీన్ మండిపడ్డారు. ఇంకా గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే అని… గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని ప్రధాని మోదీని ఒవైసీ ప్రశ్నించారు.

గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కదా? గాడ్సే అనే వ్యక్తి గాంధీ హంతకుడు. అసలు గాడ్సే పైన మీ నిర్ణయం ఏంటి? ఇప్పుడు గాడ్సేపై సినిమాని చిత్రకరిస్తున్నారు. మరి గాంధీ హంతకుడుపై తీయబోతున్న సినిమాని మీరు భారతదేశంలో బ్యాన్‌ చేస్తారా?. మీ గురించి, బీజేపీ గురించి ప్రచారం చేస్తోన్న వార్తని బ్యాన్‌ చేస్తున్నారు. మీ గురించి బీబీసీ ప్రసారం చేసిన వార్తని బ్యాన్ చేశారు. మరి గాడ్సేపై తీయబోతున్న సినిమాని భారత దేశంలో బ్యాన్‌ చేస్తారా? అని అని ప్రధాని మోదీని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు అసదుద్దీన్ ఓ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో తల్వార్లు, కత్తులతో దాడి చేస్తున్న వారిని ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీస్ కమిషనర్‌ను అసదుద్దీన్ కోరారు. దాడులకు పాల్పడే వారికి శాశ్వతంగా బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.