Roja Selvamani: స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా మెంబర్‌గా మంత్రి రోజా.. సౌత్ ఇండియాకి ప్రాతినిధ్యం!

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 09:12 PM

Roja Selvamani: స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా మెంబర్‌గా మంత్రి రోజా.. సౌత్ ఇండియాకి ప్రాతినిధ్యం!

Roja Selvamani: ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కె. రోజా సెల్వమణికి మరో ప్రతిష్టాత్మకమైన పదవి దక్కింది. కేంద్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా మంత్రి రోజా నియామకం అయ్యారు. దీనికి సంబంధించి సెక్రటరి జితిన్ నర్వల్ సమాచారాన్ని సోమవారం నాడు అందించారు. మొత్తం 5 రాష్ట్రాల క్రీడా శాఖా మంత్రులకు ఈ అవకాశం లభించింది.

దక్షిణ భారతదేశం నుంచి మంత్రి ఆర్‌కే రోజా సెల్వమణిని స్పోర్ట్ అథారిటీ మెంబర్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియాలో తనకు సభ్యత్వం లభించడంపై మంత్రి రోజా స్పందించారు. ఈ అరుదైన అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. తనపై నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా.. మెరుగైన రీతిలో సేవలు అందిస్తానని ఆమె పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వ క్రీడా మంత్రిని కేంద్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఎంపిక చేయ్యటం పట్ల ఏపీ క్రీడాకారులకు ఉపయోగ పడుతుందని ప్రభుత్వ వర్గాలు, క్రీడా కారులు ఆశిస్తున్నారు. కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ప్రెసిడెంట్‌గా కొనసాగే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యవర్గంలో రోజాతో పాటు హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, త్రిపుర రాష్ట్రాల క్రీడల శాఖ మంత్రులకు కేంద్రం చోటు కల్పించింది.