BJP-BRS: కేసీఆర్‌ను బ్రోకరన్న బండి సంజయ్.. మోడీని బ్రోకర్ అనలేనా అన్న మంత్రి కేటీఆర్!

Kaburulu

Kaburulu Desk

March 27, 2023 | 11:15 PM

BJP-BRS: కేసీఆర్‌ను బ్రోకరన్న బండి సంజయ్.. మోడీని బ్రోకర్ అనలేనా అన్న మంత్రి కేటీఆర్!

BJP-BRS: ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం, మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శల ఘాటు తీవ్రంగా ఉంది. సోమవారం మంత్రి కేటీఆర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాలుగేళ్లయింది అయ్యింది ఎంపీ అయ్యి మరి ఏం పీకనవ్‌ అని గల్లా పట్టి నిలదీసి అడగాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇజ్జత్‌, మానం ఉంటే ఏం చేసినవో చెప్పు అంటే ఏం తెల్వది. మీదికి అడ్డం పొడువు మాట్లాడుతడు. బాధ ఎందుకు అనిపిస్తుందంటే.. ‘ఇది నిన్న పేపర్‌. నేను వాలాయించి తెచ్చుకున్న. ఈ పేపర్లలో ఏం రాశారో ఎరుకేనా? టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేటీఆర్‌ పనే. ఆయన రాజీనామా ఎట్ల చేయడో చూస్తా. ఇంకా దారుణం ఏంటంటే.. ముఖ్యమంత్రిని పట్టుకొని బ్రోకర్‌ అంటున్నడు. నాకు అనరాదా? నీ ప్రధానమంత్రి అదానీకి బ్రోకర్‌ అని నేను అనలేనా? మీ ప్రధాని నరేంద్ర మోదీ ఓ బ్రోకర్‌ అని అనలేనా? కానీ.. నేను అన. మాకు సంస్కారం ఉంది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మాకు చేత కాదా? మాకు మాటలు రావా? నేను సిరిసిల్లకు మెడికల్‌ కాలేజీ, ఇంజినీరింగ్‌ కాలేజీ, వ్యవసాయ కాలేజీ, పాలిటెక్నిక్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ తీసుకువచ్చినా. నువ్వు తెచ్చిన బుడ్డ పాఠశాలనైనా చూపిస్తావా? మా నేతన్నలకు సిరిసిల్లలో వేలకోట్ల ఆర్డర్లు బతుకమ్మ చీరెలకు నేను.. ఆర్‌వీఎం ఆర్డర్లు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మరి నువ్వు చూపిస్తావా? నేతన్నలకు చేసిన పని. నువ్వు చేసింది ఏమైనా ఉందా? ఇక్కడ అపెరల్‌ పార్క్‌ ఉన్నది. కొత్తగా కడుతున్నమ్‌ వర్కర్‌ టూ ఓనర్‌.. రూ.400కోట్లతో 1100 మందిని ఓనర్లు చేయబోతున్నామని ఆయన అన్నారు.

మా ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన బిఎల్ సంతోష్ బ్రోకర్ కాదా? నేను పేపర్ లీక్ చేసి అమ్ముకుని బతుకుతున్నానట. జీవితంలో రేవంత్, బండి ఎప్పుడైనా ఒక్కపరీక్షైనా రాసారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ ఎంపి అరవింద్ ది ఫేక్ డిగ్రీ అని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ పుట్టుకను అవమానించింది ప్రధాని మోడీ కాదా? గుజరాత్ గులాంల చెప్పులు మోసే బండి సంజయ్ తెలంగాణలో పుట్టడం దురదృష్టకరమన్నారు. దేశ సంపదను ప్రధాని మోడీ తన దోస్తులకు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.