Kaikala Satyanarayana : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత..

Kaikala Satyanarayana : ప్రముఖ సీనియర్ నటుడు, ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన కైకాల సత్యనారాయణ నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన నేడు తెల్లవారుజామున ఫిలింనగర్ లోని ఆయన నివాసంలో మరణించారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.
1935లో కృష్ణ జిల్లా కవుతరం గ్రామంలో జన్మించిన కైకాల 1959లో సిపాయి కూతురు అనే సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. అనంతరం ఎన్నో రకరకాల పాత్రలతో దాదాపు 700 పైచిలుకు సినిమాల్లో నటించి మెప్పించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద, కమర్షియల్ సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించారు.
RRR : ఆస్కార్‌కి ఒక్క అడుగు దూరంలో.. ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ‘నాటు నాటు’ సాంగ్..
యమగోల సినిమాలో ఎన్టీఆర్ కి ధీటుగా యముడి పాత్రలో తన గంభీరమైన డైలాగ్ డెలివరీతో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఆ పాత్రతో యముడు అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేలా చేసి ఆ తర్వాత కూడా మరిన్ని సినిమాల్లో యముడి పాత్రలు పోషించారు. అలాగే ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ లో జాయిన్ అయి మచిలీపట్టణం నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా సేవలు అందించారు. 2013 నుంచి సినిమాలకి దూరంగా ఉన్న ఆయన చివరిసారిగా 2019 లో మహర్షి సినిమాలో కాసేపు కనిపించి అలరించారు. 87 ఏళ్ళ వయసులో ఆయన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.