Pawan Kalyan: కోడి కత్తితో పొడిపించుకోను.. కానీ ఖచ్చితంగా సీఎం అవుతా!

Kaburulu

Kaburulu Desk

January 26, 2023 | 03:54 PM

Pawan Kalyan: కోడి కత్తితో పొడిపించుకోను.. కానీ ఖచ్చితంగా సీఎం అవుతా!

Pawan Kalyan: కోడి కత్తితో పొడిపించుకొను కానీ ఖచ్చితంగా ఏపీకి సీఎం అవుతా అంటూ జనసేనాని పవర్ ఫుల్ డైలాగులు వినిపించారు. జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొని మాట్లాడారు. తాను సీఎం కావాలని రాజకీయాల్లోకి రాలేదని.. మార్పు కోసమే వచ్చానని తెలిపారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావులను స్మరించుకోవాలని.. అప్పుడు మత ప్రతిపాదికన దేశ విభజన జరిగిందని తెలిపారు.

వారాహి ఎలా రోడ్ల మీదకు వస్తుందో చూస్తామంటున్నారని.. నేను చట్టాలను గౌరవించేవాడిని.. కోడి కత్తితో పోడిపించుకుని డ్రామాలాడేవాడిని కానని సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. నేను సీఎం అయితే ఏంటీ.. కాకుంటే ఏంటీ..? కానీ నేను సీఎం అయితే ప్రజలకు మేలు జరుగుతుందని మీరు కోరుకుంటే అవుతానన్నారు. సీఎం మా కులస్తుడని ఓటేస్తే ఎలా..? వైసీపీ నేతలను తిట్టడం నాకేం సరదానా..? ఇష్టానుసారం మట్లాడితే నా అంత తీవ్రవాది ఉండరు.

తెలంగాణ విభజన తర్వాత ఏపీ ఏమైపోతోంది? ఏపీని పాలిస్తున్న వైసీపీ నేతలకు సిగ్గుందా అసలు? రూ. 5 వేలు ఇస్తే సరిపోతుందా? వాలంటీర్ ఉద్యోగం సరిపోతుందా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవో నంబర్ 1 గురించి మాట్లాడిన పవన్.. రోడ్డు మీదకు వస్తానంటే మిమ్మల్ని ఆపేస్తాం, తోసేస్తాం, కింద పడేస్తాం.. అంటున్నారని, తప్పుడు పనులు చేసి వేల కోట్లు దొబ్బేసి, వేల ఎకరాలు దోచేసుకుని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని కూడా దుర్వినియోగం చేసిన మీకే ఇంత ధైర్యం ఉంటే ఏ తప్పూ చేయని మాకెంత ఉండాలని ప్రశ్నించారు.

ఏపీకి రాజకీయ స్థిరత్వం కావాలి.. లేకుంటే అభివృద్ధి పక్క రాష్ట్రాలకు వెళ్తుందని పవన్‌ విమర్శించారు. ఈ వైసీపీ సన్నాసుల ఆలోచనలు భావజాలంతో విసిగిపోయామని.. ఈ ధోరణిని మార్చుకోకపోతే తోలుతీసి కూర్చోబెడతాం అని ఆయన పేర్కొన్నారు. నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడడమే మేము జనసేన లక్ష్యమని పేర్కొన్న పవన్.. రాష్ట్రాన్ని మంత్రులు కోరినట్లుగా ముక్కలు ముక్కలుగా పంచలేమని.. రాష్ట్రం కోసం ఎందరో ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారని గుర్తుచేశారు.