Assam: 11 నెలల బాలుడి కడుపులో పిండం.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు ఏమన్నారంటే?

Kaburulu

Kaburulu Desk

January 22, 2023 | 05:33 PM

Assam: 11 నెలల బాలుడి కడుపులో పిండం.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు ఏమన్నారంటే?

Assam: ఆ దంపతులకు పండండి మగబిడ్డ పుట్టాడు. దీంతో ఆ తల్లిదండ్రులు చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అలా అలా 11 నెలలు గడించింది. చిన్నారి అనారోగ్యం పాలయ్యాడు. పిడియాట్రిక్ దగ్గరకి తీసుకెళ్తే ఆ డాక్టర్ అనుమానించి కొన్ని వైద్య పరీక్షలు చేశారు. దీంతో ఆ అబ్బాయి కడుపులో పిండం ఉన్నట్లు గురించారు. సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేసి పిండాన్ని తొలగించాలని వైద్యులు తల్లిదండ్రులకు సూచించగా వాళ్ళు కూడా ఒకే చెప్పారు. దీంతో కొన్ని గంటలపాటు శ్రమించి బాలుడికి కడుపులోని పిండాన్ని తొలగించారు.

అస్సాంలోని డిబ్రుగఢ్ లో ఈ అరుదైన సర్జరీ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ చాంగ్లాంగ్ జిల్లాకు చెందిన బాలుడికి అస్సాం వైద్యులు ఈ అరుదైన శస్త్ర చికిత్సను చేశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని అపేక్ష ఆసుపత్రికి తీసుకెళ్ళగా.. బాలుడికి అన్ని పరీక్షలు చేసిన వైద్యులు.. కడుపులో పిండం ఉండడాన్ని
గుర్తించి.. తల్లిదండ్రుల అనుమతితో ఆపరేషన్ చేసి తొలగించారు.

బాలుడి శస్త్రచికిత్స అనంతరం మాట్లాడిన ఓ వైద్యుడు.. ఇలా చిన్న పిల్లల కడుపులో పిండం ఉండటాన్ని వైద్య పరిభాషలో ఫెటస్-ఇన్-ఫీటూ అంటారని.. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయని.. 10 లక్షల మందిలో ఒకరికి
మాత్రమే ఇలా జరుగుతుందని చెప్పారు. ఈ శస్త్రచికిత్స కూడా చాలా సంక్లిష్టక్లిష్టమైనదని.. అప్రమత్తంగా లేకపోతే కిడ్నీల నుంచి రక్తశ్రాక్తశ్రావం జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఫీటస్ ఇన్ ఫీటుగా పిలిచే ఈ సమస్య.. గర్భా శయంలో కవలలు వృద్ధి చెందుతున్న దశలో ఏర్పడే వైకల్యం వల్ల కలుగుతుందని చెప్పారు. చిన్నారి తల్లి కడుపులో రెండు పిండాలు ఉన్నప్పుడు.. ఓ పిండం పూర్తి స్థాయిలో వృద్ధి చెందదని.. అది వృద్ధి చెందిన మరో పిండంలో అలాగే ఉండి చనిపోతుంది. దీనినే ఫీటస్ ఇన్ ఫీటు సమస్య అంటరాని చెప్పారు.

గత ఏడాది నవంబర్ లో కూడా 21 రోజుల చిన్నారి కడుపులో నుంచి ఎనిమిది పిండాలను తొలగించారు ఝార్ఖండ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు. రెండు నెలల వ్యవధిలోనే ఇప్పుడు అస్సాంలో ఇలాంటి శాస్త్రచికిత్సే చేశారు. ప్రస్తుతం ఈ బాలుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని వైద్యులు చెప్తుండగా.. చిన్నారికి చికిత్స విజయవంతం కావడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు.