Palnadu district: పల్నాడులో కాల్పుల కలకలం.. మాజీ ఎంపీపీ, టీడీపీ మండలాధ్యక్షుడిపై ఫైరింగ్

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 08:34 AM

Palnadu district: పల్నాడులో కాల్పుల కలకలం.. మాజీ ఎంపీపీ, టీడీపీ మండలాధ్యక్షుడిపై ఫైరింగ్

Palnadu district: ఏపీలోని పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. రొంపిచర్ల మండలం అలవాలలో ఈ కాల్పు లు చోటుచేసుకున్నా యి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఏకంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి పారిపోయారు. ప్రత్యర్థులు ఆయన మీద రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.

ప్రత్యర్థుల దాడిలో టీడీపీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డితో పాటు అయన కుటుంబ
సభ్యులు కూడా గాయపడ్డారని తెలుస్తుంది. గాయాల పాలైన వారిని కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. ఈ కాల్పులకు తెగ బడింది ఎవరు? రాజకీయ కక్షలా? కుటుంబ తగాదాల అన్నది తెలియాల్సి ఉండగా.. టీడీపీ మండల నేతపై ఇంట్లోకి చొరబడి మరీ కాల్పులు జరగడంతో స్థానికంగా, ముఖ్యంగా రొంపిచర్ల మండలంలో కలకం రేగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేత చదలవాడ అరవిందబాబు బాధితుడు బాలాకోటిరెడ్డిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించగా మరికొందరు జిల్లా టీడీపీ నేతలు కూడా పరామర్శకు వెళ్లనున్నారు.

ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిపై ఇంటిపై అటాక్ చేసి ఈతరహా కాల్పులు జరపడంతో స్థానిక నేతలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, ఈ కాల్పులకు గల కారణాలు ఏమై ఉండవచ్చని స్థానికులు, పార్టీ శ్రేణులలో చర్చ నడుస్తుంది. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉండగానే ఈతరహాలో కాల్పులకు తెగబడితే రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో అని పల్నాడు ప్రజలు భయపడిపోతున్నారు.