BRS Party: సర్వం సిద్ధం.. బీఆర్ఎస్ సభకు కనీవినీ ఏర్పాట్లు!

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 08:40 AM

BRS Party: సర్వం సిద్ధం.. బీఆర్ఎస్ సభకు కనీవినీ ఏర్పాట్లు!

BRS Party: ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన తర్వాత నిర్వహించే తొలిసభ కావడంతో పార్టీ అధిష్టానం ఈ సభ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంత్రి హరీష్ రావు కొన్ని రోజులుగా ఖమ్మంలోనే మకాం వేసి మరీ సభ ఏర్పాట్లను దగ్గరుండి నిర్వహించారు. సీఎం కేసీఆర్ తో పాటు మరో ఇద్దరు సీఎంలు, జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా హాజరయ్యే సభ కావడంతో సభ ఏర్పాట్లను కూడా భారీ స్థాయిలోనే చేపట్టారు.

మరోవైపు భారీ హోర్డింగ్లు, నేతల కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా తోరణాలతో.. ఖమ్మం గులాబీ మయంగా మారింది. ఈ సభ కోసం జనసమీకరణ కూడా భారీ స్థాయిలోనే చేపడుతున్నారు. దాదాపుగా 16 నియోజకవర్గాల నుండి జనసమీకరణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయా నియోజకవర్గాల నేతలకు ఈ జనసమీకరణ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తుంది. ఖమ్మం నూతన కలెక్టరేక్టట్ వెనుక నిర్వహిస్తున్న ఈ సభ కోసం 100 ఎకరాలు సిద్ధం సిద్ధం చేయగా.. 400 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే సభా వేదికను ఆధునిక హంగులతో ముస్తాబు చేయగా.. జర్మన్ టెక్నాలజీతో వాటర్, ఫైర్ ఫ్రూఫ్ గా ఈ వేదికను రూపొందించారు. మొత్తం 200 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేయగా.. మొత్తం 20 ప్రాంతాల్లో 400 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. ఇక, బహిరంగ సభలో.. 50 భారీ ఎల్ఈడీ తెరలు, 100 మొబైల్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేశారు.

ఇక, వెయ్యి మంది వాలంటీర్లు సభలోని గ్యాలరీల్లో ఉంటూ ఎవరికీ ఇబ్బందులు రాకుండా ఎక్కడికక్కడ విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం శివారులోని వెంకటాయపాలెం వద్ద జరిగే ఈ సభను అటు ఏపీ, ఇటు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలను ఉద్దేశించి కూడా నిర్వహిస్తుండగా ఈ వేదిక నుండి సీఎం కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.