Surendar Reddy : డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ప్రమాదం.. వీల్ చైర్ లో కూర్చొనే షూటింగ్..

షూటింగ్ లో సీన్ వివరిస్తుండగా డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ప్రమాదం జరిగినట్టు సమాచారం. వెంటనే చిత్రయూనిట్ సురేందర్ రెడ్డిని హాస్పిటల్ కి తరలించారు. కాలికి బాగా గాయం అయిందని చికిత్స చేసి కట్టు వేశారు డాక్టర్లు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు.......................

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 12:55 PM

Surendar Reddy :  డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ప్రమాదం.. వీల్ చైర్ లో కూర్చొనే షూటింగ్..

Surendar Reddy :  డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఏజెంట్ సినిమాని గ్రాండ్ గా తీస్తున్నారు. అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా, మలయాళ స్టార్ మమ్ముట్టి విలన్ గా సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటివరకు క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాలో ఫుల్ మాస్ యాక్షన్ తో రాబోతున్నాడు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా.

ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమాని 2023 సమ్మర్ లో ఎలాగైనా రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ శరవేగంగా వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ లో సీన్ వివరిస్తుండగా డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ప్రమాదం జరిగినట్టు సమాచారం. వెంటనే చిత్రయూనిట్ సురేందర్ రెడ్డిని హాస్పిటల్ కి తరలించారు. కాలికి బాగా గాయం అయిందని చికిత్స చేసి కట్టు వేశారు డాక్టర్లు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

Amigos : అమిగోస్ టీజర్ విడుదల.. మూడు క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేయడానికి వస్తున్న కళ్యాణ్ రామ్..

అయినా కొంచెం గ్యాప్ తీసుకొని తాజాగా ఏజెంట్ సినిమా షూట్ ని మళ్ళీ మొదలుపెట్టారు. ఈ షూట్ లో సురేందర్ రెడ్డి వీల్ చైర్ లో వచ్చి మరీ షూటింగ్ జరిపించారు. దీంతో సురేందర్ రెడ్డి ఫోటోలు వైరల్ గా మారాయి. నడవలేని స్థితిలో ఉండి కూడా వీల్ చైర్ లో వచ్చి షూటింగ్ నడిపించడంతో అందరూ సురేందర్ రెడ్డిని అభినందిస్తున్నారు. ఇక ఏజెంట్ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ తో అలరించనున్నాడు. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.