Vande Bharat Express: నేటి నుండే వందే భారత్ ట్రైన్ టికెట్ల బుకింగ్.. రేట్ల వివరాలివే!

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 01:58 PM

Vande Bharat Express: నేటి నుండే వందే భారత్ ట్రైన్ టికెట్ల బుకింగ్.. రేట్ల వివరాలివే!

Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఆదివారం అనగా ఈనెల 15 నుంచి ప్రారంభం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ వీడియో లింక్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకూ నడిస్తుంది. సంక్రాంతి పండుగ కానుకగా అందిస్తున్న ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కు శనివారం నుంచే టికెట్ బుకింగ్ లను అందుబాటులోకి తెస్తున్నారు.

ఈ వందేభారత్ ట్రైన్ కోసం బుకింగ్లను ఈనెల 14వ తేదీ ఆదివారం నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. ట్రైన్ నంబర్ 20833 విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ 05.45 గంటలకు ప్రారంభమై 14.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు 8.30 గంటల ప్రయాణానికి తగ్గనున్న ఈ వందే భారత్ ట్రైన్.. సోమవారం నుండి ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానుంది.

ట్రైన్ నంబర్ 20833 విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ 05.45 గంటలకు ప్రారంభమై 14.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలు నంబర్ 20834 సికింద్రాబాద్ – విశాఖపట్నం ట్రైన్.. సికింద్రాబాద్ నుండి 15.00 గంటలకు బయలుదేరి 23.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించే మార్గంలో రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ ప్రధాన స్టేషన్ లలో రెండు వైపులా ఆగుతుంది. ఈ ట్రైన్లో మొత్తం 14 ఏసి చైర్ కార్ కోచ్లు, 1128 మంది ప్రయాణికుల సామర్థ్యంతో అందుబాటులో ఉంటుంది.

ఇక, ఈ వందే భారత్ ట్రైన్ టికెట్ల రేట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి.
సికింద్రాబాద్ టు వరంగల్ – 520/-,
సికింద్రాబాద్ టు ఖమ్మం – 750/-,
సికింద్రాబాద్ టు విజయవాడ – 905/-,
సికింద్రాబాద్ టు రాజమండ్రి – 1365/-,
సికింద్రాబాద్ టు విశాఖపట్నం – 1665/-.