Bandla Ganesh : బీఆర్ఎస్ ఎంపీ నా దేవుడు అంటున్న బండ్ల గణేష్.. మరోసారి రాజకీయాలపై వ్యాఖ్యలు..

తాజాగా బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి నా దేవుడు అంటూ ఆయన కాళ్ళ మీద పడి, ఆయన్ని పొగడటం సంచలనంగా మారింది. బండ్ల గణేష్ అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నాడు, ఇక ఆయన పొగిడే పవన్ కళ్యాణ్ జనసేన. ఈ రెండు పార్టీలు కాకుండా బీఆర్ఎస్ ఎంపీని పొగడటం ఇప్పుడు రాజకీయాల్లో కూడా చర్చగా మారింది............

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 11:51 AM

Bandla Ganesh : బీఆర్ఎస్ ఎంపీ నా దేవుడు అంటున్న బండ్ల గణేష్.. మరోసారి రాజకీయాలపై వ్యాఖ్యలు..

Bandla Ganesh :  బండ్ల గణేష్ తన సినిమాల కన్నా తన స్పీచ్ లు, మాటలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తాడు. పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా మరింత పాపులర్ అయ్యాడు. తన స్పీచ్ లకి కూడా అభిమానులు ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం నేను రాజకీయాలకి గుడ్ బై చెప్పేస్తున్నాను అని అందరికి షాక్ ఇచ్చాడు బండ్లన్న. ఇకపై నాకు, రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, రాజకీయాల గురించి మాట్లాడకపోతేనే మంచిది అంటూ ట్వీట్స్ కూడా చేశాడు.

అప్పట్నుంచి రాజకీయాల గురించి మాట్లాడటం మానేసినా వేరేవాళ్లు చేసిన ట్వీట్స్ మాత్రం రీ ట్వీట్ చేస్తున్నాడు. కానీ తాజాగా బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి నా దేవుడు అంటూ ఆయన కాళ్ళ మీద పడి, ఆయన్ని పొగడటం సంచలనంగా మారింది. బండ్ల గణేష్ అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నాడు, ఇక ఆయన పొగిడే పవన్ కళ్యాణ్ జనసేన. ఈ రెండు పార్టీలు కాకుండా బీఆర్ఎస్ ఎంపీని పొగడటం ఇప్పుడు రాజకీయాల్లో కూడా చర్చగా మారింది.

TS Congress: కాంగ్రెస్ ధర్నాకి ముహూర్తం ఒకే.. నేతలే కలిసి వస్తారా?

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బండ్లగణేష్ ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్ళపై పడి దండం పెట్టాడు. బండ్ల గణేష్ మాట్లాడుతూ రంజిత్ రెడ్డి అన్న లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని. ఆయన నాకు దేవుడుతో సమానం అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే రంజిత్ రెడ్డిని బండ్ల గణేష్ దేవుడు అనేంత సాయం ఏం చేశాడో మాత్రం చెప్పలేదు. మొత్తానికి మరోసారి బండ్లన్న తన వ్యాఖ్యలతో ఎప్పటిలాగే వైరల్ గా మారాడు.