Balakrishna : NTR యూనివర్సిటీ పేరు మార్పు.. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ బాలయ్య బాబు..

Kaburulu

Kaburulu Desk

September 24, 2022 | 09:09 AM

Balakrishna : NTR యూనివర్సిటీ పేరు మార్పు.. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ బాలయ్య బాబు..

Balakrishna :  ఇటీవల ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ బిల్లుని పాస్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు, ఎన్టీఆర్ అభిమానులు, సాధారణ ఓటర్లు సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే చాలా మంది స్పందించారు, విమర్శలు చేశారు. ఇక నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బాలకృష్ణ ఫైర్ అయ్యారు.

Suhasini Manirathnam : పొన్నియిన్ సెల్వన్ కథ వల్ల మా పెళ్లి ఆగిపోతుందేమో అని భయపడ్డాను..

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై బాలకృష్ణ స్పందిస్తూ.. ”మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు, పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు, పీతలున్నారు. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్, శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు” అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చగా మారాయి.