Ali : ఏపీ ప్రభుత్వంలో కమెడియన్ అలీకి కీలక పదవి..

Kaburulu

Kaburulu Desk

October 28, 2022 | 08:54 AM

Ali : ఏపీ ప్రభుత్వంలో కమెడియన్ అలీకి కీలక పదవి..

Ali :  కమెడియన్ అలీ గతంలోనే వైఎసార్సీపీ పార్టీలో చేరి పార్టీ కోసం ప్రచారం చేశాడు. ఆ సమయంలో తన స్నేహితుడు, జనసేన అధినేత పవన్ పై కూడా విమర్శలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో అలీని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు విమర్శించారు. అయినా అలీ వీటిని లెక్కచేయకుండా వైసీపీకి ప్రచారం చేస్తూ వచ్చారు.

గతంలో అలీకి వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా పదవి ఇస్తారని ప్రహారం జరిగింది. పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టడానికి అలీకి కచ్చితంగా ఏదో ఒక పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. అలీ కూడా ప్రభుత్వం ఏదైనా బాధ్యత ఇస్తే కచ్చితంగా చేస్తాను అన్నాడు. ఇటీవల కొన్ని రోజులుగా ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టు రాజకీయాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ పిలిచి మరీ అలీకి పదవి ఇచ్చాడు.

RGV : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆర్జీవీ కొత్త సినిమాలు.. జగన్ ని కలిసిన కాసేపటికే ప్రకటన..

ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేశారు. రాష్ట్రంలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టు ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ స్నేహితుడు అలీకి జగన్ పిలిచి పదవి ఇవ్వడంతో ఈ విషయం చర్చగా మారింది.