Krishnam Raju : కృష్ణంరాజు కోసం ఏపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా.. రోజానే సాక్ష్యం..

Krishnam Raju : ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం ప్రభాస్ కి తీరని లోటుని మిగిల్చింది. తాజాగా కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరులో అయన సంస్మరణ సభని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు ఫ్యామిలీ తరలివెళ్లింది. మొగల్తూరులో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభకి భారీ ఎత్తున అభిమానులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు.
Rashmika Mandanna : సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు.. లైగర్ నాకు నచ్చింది..
ఏపీ ప్రభుత్వం తరపున పలువురు మంత్రులు ఈ సభకి విచ్చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు స్మృతివనం కోసం మొగల్తూరు తీరప్రాంతంలో రెండెకరాల స్థలాన్ని కేటాయించనున్నట్టు ఏపీ టూరిజం, సాంసృతిక శాఖ మంత్రి రోజా ఏపీ ప్రభుత్వం తరపున తెలిపింది. అలాగే స్మృతివనంకి కావాల్సిన అన్ని సదుపాయాలు అందచేస్తామని తెలిపింది. దీనికి కృష్ణంరాజు కుటుంబం ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు కూడా ఈ విషయంలో సంతోషించారు.