Atmasakshi Survey: ఏపీలో మరో ఎన్నికల సర్వే.. టీడీపీ, వైసీపీలకు ఎన్ని సీట్లంటే?

Kaburulu

Kaburulu Desk

March 6, 2023 | 11:13 PM

Atmasakshi Survey: ఏపీలో మరో ఎన్నికల సర్వే.. టీడీపీ, వైసీపీలకు ఎన్ని సీట్లంటే?

Atmasakshi Survey: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉన్నా ఇక్కడ ఇప్పుడే సర్వేలు, ఫలితాలు కూడా మొదలయ్యాయి. తాజాగా వెల్లడైన ఆత్మసాక్షి సర్వే సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే పలు మార్లు ఏపీ రాజకీయాల్లో సర్వేలు చేసి.. రిలీజ్ చేసిన ఆత్మసాక్షి మరోసారి సర్వే వివరాలని బయటపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 17 వరకు చేసిన సర్వే వివరాలు విడుదల చేశారు. ఈ సర్వే ప్రకారం ఊహించని విధంగా అధికార వైసీపీకి 63 స్థానాలు, టీడీపీకి 78 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇక జనసేనకు 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

అంతేకాదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆత్మసాక్షి తాజా సర్వే తేల్చింది. కనీసం 10 మంది మంత్రులు ఒడిపోతారని స్పష్టం చేసింది. ఆ జాబితాలో మంత్రి రోజా మొదటి వరసలో ఉండగా.. అదే విధంగా వైసీపీ మంత్రులు చాలా మంది ఓటమి బాటన ఉన్నారని సర్వే పేర్కొంది. ఉమ్మడి జిల్లా వారీగా చూస్తే…శ్రీకాకుళం(10): టి‌డి‌పి-6, వైసీపీ-2, టఫ్ ఫైట్-2.. విజయనగరం(9): టి‌డి‌పి-4, వైసీపీ-3, టఫ్ ఫైట్-2.. విశాఖ(15): టి‌డి‌పి-7, వైసీపీ-5, టఫ్ ఫైట్-3.. తూర్పు గోదావరి(19): టి‌డి‌పి-6, వైసీపీ-6, జనసేన-4, టఫ్ ఫైట్-3.. పశ్చిమ గోదావరి(15): టి‌డి‌పి-8, వైసీపీ-2, జనసేన-3, టఫ్ ఫైట్-2.. కృష్ణా(16): టి‌డి‌పి-8, వైసీపీ-5, టఫ్ ఫైట్-3.. గుంటూరు(17): టి‌డి‌పి-8, వైసీపీ-6, టఫ్ ఫైట్-3.. ప్రకాశం(12) టి‌డి‌పి- 6, వైసీపీ-5, టఫ్ ఫైట్-1.. నెల్లూరు(10): టి‌డి‌పి-5, వైసీపీ-2, టఫ్ ఫైట్-3.. ఛిత్తూరు(14): టి‌డి‌పి-4, వైసీపీ-8, టఫ్ ఫైట్-2.. అనంత(14): టి‌డి‌పి-7, వైసీపీ-7, టఫ్ ఫైట్-1, కడప(10): టి‌డిపి- 2, వైసీపీ-6, టఫ్ ఫైట్-2..కర్నూలు(14): టి‌డి‌పి-7, వైసీపీ-7 సీట్లు గెలుచుకుంటుందని ఆత్మసాక్షి సర్వే అంచనా వేసింది.

గత 2019 ఎన్నికలలో ఈ ఆత్మసాక్షి గ్రూప్ వైసీపీకి 139-142 సీట్లు వస్తాయని అంచనావేయగా.. టీడీపీకి 22-28, జనసేనకు 0-2 వస్తాయని క్లియర్ కట్ గా అంచనావేసింది. ఈ ఫలితాలు నూటికి నూరుపాళ్లు నిజం అయ్యాయి. ఇక ఎంపీ సీట్ల విషయంలోనూ వైసీపీకి 22 సీట్లు టీడీపీకి 3 సీట్లు వస్తాయని తెలిపింది. అది 100కు 100శాతం నిజం కావడం విశేషం. ఇక ఇవే కాదు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ చెప్పినట్టే వైసీపీ గెలవడం విశేషం.