Alia Bhatt : పాపకి జన్మనిచ్చిన అలియా భట్..

Kaburulu

Kaburulu Desk

November 6, 2022 | 07:54 AM

Alia Bhatt : పాపకి జన్మనిచ్చిన అలియా భట్..

Alia Bhatt :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఏప్రిల్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన నెల రోజులకే తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది అలియా. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అలియా షూటింగ్స్, సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది.

Unstoppable : అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ రిలీజ్.. శర్వానంద్, అడివి శేష్‌లతో కలిసి రచ్చ రచ్చ చేసిన బాలయ్య

తాజాగా అలియా భట్ ఇవాళ ఉదయం ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్ లో జాయిన్ అయింది. అయితే అందరూ కేవలం చెకప్ కోసమే అనుకున్నారు. కానీ అలియా భట్ కొద్ది సేపటి క్రితమే ఓ పండంటి పాపకి జన్మనిచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు రణబీర్, అలియా జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే పెళ్లైన నెలకే ప్రెగ్నెన్సీ అని చెప్పడం, ఇప్పుడు పెళ్ళైన 7 నెలలకే పాపకి జన్మనివ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.