Chalapathi Rao : సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత..

Kaburulu

Kaburulu Desk

December 25, 2022 | 08:29 AM

Chalapathi Rao : సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత..

Chalapathi Rao :  2022లో టాలీవుడ్ లో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం టాలీవుడ్ ఎంతోమంది అగ్రతారలని కోల్పోయింది. రెండు రోజుల క్రితమే కైకాల సత్యనారాయణ కూడా కన్నుమూశారు. తాజాగా ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూశారు. 78 ఏళ్ళ వయసులో శనివారం నాడు రాత్రి గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు.

1944లో కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించిన ఆయన 1966లో గూఢచారి 116 సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించిన ఆయన ఆ తర్వాత తండ్రి, బాబాయ్, మామ పాత్రల్లో నటించి మెప్పించారు. సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి ఆయనకి చాలా కాజ్ వ్యక్తుల్లో ఒకరిగా ఉండేవారు. దాదాపు 600 పైగా సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు చలపతి రావు. నిర్మాతగా కూడా పలు సినిమాలని నిర్మించారు.

సీనియర్ నటుడయ్యాక ఎక్కువగా బాబాయ్ పాత్రల్లో నటించి ఆ పాత్రకి వన్నె తెచ్చారు. చివరగా 2021 లో బంగార్రాజు, ఓ మనిషి నీవెవరు సినిమాల్లో నటించి మెప్పించారు. గత రెండు సంవత్సరాలుగా సినిమాలకి దూరంగానే ఉంటున్నారు. చలపతి రావుకి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే.

Kaikala Satyanarayana : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత..

ప్రస్తుతం చలపతిరావు హైదరాబాద్ బంజారాహిల్స్‌ లో తన కుమారుడు రవిబాబు ఇంట్లోనే ఉంటున్నారు. ఒక కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చాకే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చలపతిరావు మరణంతో మరోసారి టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.