Ira Khan : రెండేళ్ల డేటింగ్ తర్వాత.. ఘనంగా అమీర్ ఖాన్ కూతురి నిశ్చితార్థం..

Kaburulu

Kaburulu Desk

November 19, 2022 | 10:26 AM

Ira Khan : రెండేళ్ల డేటింగ్ తర్వాత.. ఘనంగా అమీర్ ఖాన్ కూతురి నిశ్చితార్థం..

Ira Khan :  అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ అందరికి సుపరిచితమే. తన సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో ఎప్పుడూ రచ్చ చేస్తూ ఉంటుంది. గత రెండేళ్లుగా ఐరా ఖాన్ నుపుర్ శిఖర్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. వీరిద్దరూ రెండేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పలు సార్లు వీరు ముంబైలో తిరుగుతుంటే బాలీవుడ్ మీడియా కంట పడ్డారు.

సైక్లిస్ట్ అయిన నుపుర్ శిఖర్ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఓ సైక్లింగ్ ఈవెంట్ లో అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఐరా ఖాన్ కి ప్రపోజ్ చేయగా లిప్ కిస్ ఇచ్చి ఓకే చేసింది. ఇప్పుడు వీరి రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్ళికి రెడీ అయ్యారు.

Ram Charan-Akshay Kumar : ఒకే స్టేజిపై రామ్ చరణ్, అక్షయ్ కుమార్.. ఢిల్లీలో డ్యాన్సులతో రచ్చ చేశారుగా..

తాజాగా శుక్రవారం నాడు నుపుర్ శిఖర్, ఐరా ఖాన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి నిశ్చితార్థ వేడుకకి ఇరు కుటుంబాలతో పాటు, సన్నిహితులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు విచ్చేశారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సెలబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.