Viral News: 550 మందికి తండ్రైన వ్యక్తి.. పిల్లలు పుట్టకుండా చేయాలని కోర్టుకెక్కిన స్వచ్ఛంద సంస్థ!

Viral News: ఓ వ్యక్తి 550 మందికి తండి అయ్యాడు. అతడి పేరు జోనాథన్.. అతను నెదర్లాండ్స్‌కు చెందిన వైద్యుడు. వినడానికి వింతగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది అక్షరాల నిజం. అయితే అతడు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా 550 మందికి తండ్రయ్యాడు. అడ్డు అదుపు లేకుండా వీర్యాదానంతో వందల మంది పిల్లలను కన్నాడు. ఈ విషయమే ఇప్పుడు అతడిని చిక్కుల్లో పడేసింది. జోనాథన్ పై పలువురు కోర్టుకు ఎక్కారు. అతనికి అడ్డుకట్ట వేయాలని పిటిషన్లు దాఖలు చేశారు.
నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో జొనథన్ ఎం అనే 41 ఏళ్ల డాక్టర్ నివసిస్తూ, వైద్య వృత్తిని కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు నెదర్లాండ్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 13 క్లినిక్స్‌లో జొనథన్ వీర్య దానం చేసి 550 మందికి తండ్రి అయ్యాడు. అయితే నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12 మంది మహిళలకు వీర్యం దానం చేయొచ్చు.. లేదా 25 మంది పిల్లలకు తండ్రి కావొచ్చు. కానీ జొనథన్ మాత్రం నిబంధనలను అతిక్రమించి 550 మందికి తండ్రి అయినట్లు తెలియడంతో ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జొనథన్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కోరింది. అతను ఇంత మందికి పైగా వీర్యం దానం చేసి ఉన్నాడని తెలిస్తే.. తాను జొనథన్‌ను ఎంచుకోకపోయే దాన్ని అని ఆమె పేర్కొంది. అతని వీర్యంతో పుట్టిన నా బిడ్డ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నాను. అసలు ఆ విషయం తలుచుకుంటేనే ఇబ్బందిగా అనిపిస్తుందని ఆమె తెలిపింది. అయితే జొనథన్ తన వీర్యం ద్వారా వంద మందికి పైగా చిన్నారులకు జన్మనిచ్చినట్లు 2017లోనే తెలిసింది.
దీంతో అప్పట్లో నెదర్లాండ్స్ యంత్రాంగం అప్రమత్తమై.. ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్డ్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ అతన్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. అయితే, అతను అక్కడ నుండి మకాం మార్చి ప్రపంతా వ్యాప్తం దేశాలు తిరుగుతూ వీర్యదానం చేస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం జొనథన్ కెన్యాలో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇక, న్యాయ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.