Assembly Elections 2023: 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీలు ఇవే

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 03:50 PM

Assembly Elections 2023: 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీలు ఇవే

Assembly Elections 2023: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బుధవారం ప్రకటించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరుగుతాయని, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరుగుతాయని సీఈసీ ప్రకటించింది. మూడు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింంపు మార్చి 2న జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

ఈ మూడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికలు జరగనున్న ఈ మూడు రాష్ట్రాలలో కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. మూడు రాష్ట్రాలలో కలిపి మొత్తం 62.8 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మూడు రాష్ట్రాల ప్రస్తుత శాసనసభల పదవీకాలం మార్చితో ముగియనుండగా.. నాగాలాండ్ అసెంబ్లీ పదవీకాలం మార్చి 12న ముగియనుండగా.. మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల పదవీకాలం వరుసగా మార్చి 15, మార్చి 22న ముగుస్తుంది.

ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఏసీ బృందం ఈ మూడు రాష్ట్రాలలో పర్యటించి ఎన్నికలపై రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు 60 మంది సభ్యుల బలం ఉంది. నాగాలాండ్‌లో బీజేపీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో కలిసి అధికార కూటమిలో ఉండగా.. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన కాన్రాడ్ సంగ్మా ప్రాంతీయ పార్టీలు, బీజేపీతో పొత్తులు పెట్టుకుంది. ఇప్పుడు ఈ ఎన్నికలకు ఎవరు పొత్తులలో ఉంటారో.. ఎవరు దూరమవుతారో చూడాలి.