Vijayawada: రైల్వే స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48 కోట్ల విలువైన 12.5 కిలోల బంగారం పట్టివేత!

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 07:56 PM

Vijayawada: రైల్వే స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48 కోట్ల విలువైన 12.5 కిలోల బంగారం పట్టివేత!

Vijayawada: ఇప్పటి వరకు శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడడం విన్నాం. కానీ, కళ్ళు చెదిరేలా విజయవాడ రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టుబడింది. రైల్వేస్టేషన్ లో ఈ స్థాయిలో బంగారం పట్టుబడడం కలకలం రేపుతోంది. సుమారు రూ.7.48 కోట్లు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి తమిళనాడు అక్రంగా బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఒక్కసారిగా నగరంలో అంత విలవైన బంగారం పట్టుబడడం చర్చనీయాంశమైంది.

అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ రైల్వే స్టేషన్‌ వద్ద పట్టుకున్నారు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బంగారం తరలిస్తున్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్న కస్టమ్స్‌ అధికారులు విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద నిఘాపెట్టారు. పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద కాపు కాశారు. తొలుత ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 5కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

అదుపులో ఉన్న వారు ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అదుపులోకి తీసుకుని 7.97 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.48 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన బంగారంలో కొంత బిస్కెట్ల రూపంలో, మరికొంత ఆభరణాల రూపంలోను ఉన్నట్టు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.