Sri Vani Tickets at Tirupathi Airport:తిరుపతి ఎయిర్పోర్టులో శ్రీవాణి దర్శన టికెట్లు.

Kaburulu

Kaburulu Desk

December 15, 2022 | 09:36 PM

Sri Vani Tickets at Tirupathi Airport:తిరుపతి ఎయిర్పోర్టులో శ్రీవాణి దర్శన టికెట్లు.

శ్రీవాణి ట్రస్ట్ వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆఫ్ లైన్ టికెట్ల సెంటర్ ను తిరుపతి ఎయిర్పోర్టులో ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ను జేఈవో శ్రీ వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు గురువారం నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే లభించనున్నాయి.

టికెట్ల కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, గతంలో శ్రీవాణి ట్రస్టుకు 10 వేల రూపాయలు విరాళం ఇచ్చి టికెట్ కోసం 500ల రూపాయలు చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేసేవారని చెప్పారు. అనేక ప్రదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం తిరుపతి ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి లోని మాధవం గెస్ట్ హౌస్ లో ఇప్పటికే శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దాతలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎయిర్పోర్ట్ ,తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీని వల్ల ముందురోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన పని తగ్గుతుందని. తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన కౌంటర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వీరబ్రహ్మం కోరారు. ఈ కౌంటర్ల నిర్వహణకు సహకరిస్తున్న హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వారికి జేఈవో ధన్యవాదాలు తెలిపారు.